ఇంద్రకీలాద్రిపై కొండచరియల ఘటనపై ఈఈ భాస్కర్ మాట

బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపైన మౌన స్వామి ఆలయం దగ్గర కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆలయ ఈఈ భాస్కర్ పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు అంగులాల మేర కొండ బీటలు వారిందని భాస్కర్ తెలిపారు. అయితే, మౌన స్వామి కొండ ప్రాంతం ప్రమాదకరం కాదరి ఆయన చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా కొండ బీటలు వారుతూనే ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రమాదకరం కాదని గుర్తించిందని తెలిపారు. […]

  • Venkata Narayana
  • Publish Date - 3:21 pm, Wed, 21 October 20

బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపైన మౌన స్వామి ఆలయం దగ్గర కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆలయ ఈఈ భాస్కర్ పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు అంగులాల మేర కొండ బీటలు వారిందని భాస్కర్ తెలిపారు. అయితే, మౌన స్వామి కొండ ప్రాంతం ప్రమాదకరం కాదరి ఆయన చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా కొండ బీటలు వారుతూనే ఉందని ఆయన చెప్పారు.
ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రమాదకరం కాదని గుర్తించిందని తెలిపారు. చిన్న చిన్న రాళ్లు పడుతున్న దృష్ట్యా బ్యారికేట్లు పెట్టి అటుగా భక్తులు రాకుండా చూస్తున్నామన్నారు. అయితే, ప్రకృతి రిత్య పడితే మాత్రం జాగ్రత్త అవసరమన్నారు.