చైనాలో సెకండ్ వేవ్..? ఆందోళనలో ప్రపంచదేశాలు..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో లాక్‌డౌన్

చైనాలో సెకండ్ వేవ్..? ఆందోళనలో ప్రపంచదేశాలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 10:36 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో లాక్‌డౌన్ ఆంక్షలను మరోమారు పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం బీజింగ్‌ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన, ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 1,255 విమానాలను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. బీజింగ్‌లో ఇటీవల నమోదైన కేసులన్ని ఓ ఫుడ్ మార్కెట్‌కు లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు.

కాగా.. ఈ నగరంలోని 2.1 కోట్ల జనాభాకు ఈ ఫుడ్ మార్కెట్‌ నుంచే 90 శాతం కూరగాయలు సరఫరా అవుతాయి. బీజింగ్‌లో పరిస్థితులపై అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మార్చిలో కరోనాపై విజయం సాధించామని చైనా చెప్పింది. దీంతో ప్రపంచదేశాల్లో కూడా కరోనాను నియంత్రించగలమన్న ఓ నమ్మకం ఏర్పడింది. ఆ తరువాత దక్షిణ కొరియా కూడా కరోనాను పూర్తిగా నియంత్రించినట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు చైనా, దక్షిణ కొరియాలలో సెకండ్ వేవ్ మొదలుకావడంతో ప్రపంచదేశాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. అమెరికా, భారత్, ఇరాన్‌లలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.

మరోవైపు.. ప్రపంచదేశాలన్నిటిలో అగ్రరాజ్యంలోనే అత్యధిక కోవిద్-19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 83,15,610 కరోనా కేసులు నమోదుకాగా.. ఇందులో 22,17,153 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా 4,47,512 మంది కరోనా బారిన పడి మరణించగా.. అమెరికాలోనే 1,19,290 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పుడు చైనా, దక్షిణ కొరియాలలో సెకండ్ వేవ్ మొదలుకావడంతో తమ దేశాల్లో పరిస్థితి ఏ విధంగా మారుతుందోనని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.