Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

“దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నా.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకం. భారతీయ చలన చరిత్రకు మూలపురుషుడు అయిన దాదా సాహెబ్ పాల్కే అవార్డు పేరుతో ఇచ్చే ఈ అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. అమితాబ్ కంటే ముందు 49 మంది ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. 1969 నుంచి ఈ అవార్డును ప్రకటించడం మొదలుపెట్టారు. జ్యూరీ ఎంపిక చేసినవాళ్లకి ఈ అవార్డుని ప్రధానం చేస్తారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేసి, వేశేషసేవలందించిన వారికి ఈ అవార్డుని అందజేస్తారు. మొదటి సంవత్సరం దేవికా రాణితో మొదలు పెట్టి ఇప్పటివరకు 50 మందికి ఈ అవార్డు అందించారు. మరో ప్రత్యేకం ఏంటంటే అమితాబ్ సిని కెరీర్ ప్రారంభించిన సంవత్సరంలోనే ఈ అవార్డు ప్రధానం చేయడం ప్రారంభించారు. హిందీ చలన చిత్ర సీమ నుంచి దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న వారిలో 32వ వ్యక్తి అమితాబ్ కావడం మరో విశేషం.

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

హిందీ నటుడు వినోద్ కన్నా చనిపోయిన తర్వాత ఈ అవార్డు అందుకున్నారు. దాదా సాహెబ్ అవార్డు చరిత్రలో చనిపోయిన వ్యక్తికి అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి. తెలుగు సినీ చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో కె. విశ్వనాథ్ ఒకరు. 2016 సంవత్సరానికి గాను ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు. 2015లో మనోజ్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్‌లో పలు దేశభక్తి చిత్రాలలో నటించి ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల్లో 46వ వ్యక్తి శశి కపూర్. కపూర్ కుటుంబంలో ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి. ఈయన బాలీవుడ్‌లో ఒక తరాన్ని తన నటనతో ఆకట్టుకున్నారు. 2014లో ఆయన్ను ఈ అవార్డు వరించింది.

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. 2013లో ఈయన అవార్డు అందుకున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాలకు సాహిత్యంతో పాటు దర్శకత్వం వహించారు. ఇక 2012లో హిందీ చిత్ర సీమలో విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రాణ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. ఇక 2012లో బెంగాళీ భాషకు చెందిన సౌమిత్ర ఛటర్జీ అవార్డు అందుకున్నారు. 2010లో ప్రముఖ తమిళ దర్శకుడు కే.బాలచందర్.. 2009లో నిర్మాత డి. రామానాయుడు.. 2008లో కెమెరా మెన్‌ వి.కే.మూర్తి.. 2007లో ప్రముఖ బాలీవుడ్, బెంగాలీ గాయకుడు మన్నాడే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఒక మేల్ సింగర్ ఈ అవార్డు అందుకోవడం అదే మొదటిసారి.

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

2006లో ప్రముఖ హిందీ, బెంగాలీ దర్శకుడు తపన్ సిన్హా, 2005లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్, 2004లో ప్రముఖ మలయాళీ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్, 2003లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్, 2002లో తొలి తరం బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన దేవానంద్, 2001లో ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత యశ్ చోప్రా, 2000లలో ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని ఆశాభోస్లే, 1999లో బాలీవుడ్‌ దర్శకుడు హృషికేష్ ముఖర్జీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

1998లో ప్రముఖ దర్శక, నిర్మాత మరియు డీడీలో మహా భారత్ సీరియల్ తెరకెక్కించిన బి.ఆర్. చోప్రా, 1997లో యే మేరే వతన్ కే లోగోతో పాటు పలు దేశభక్తి గీతాలు, అలాగే బాలీవుడ్‌లో ప్రముఖ దేశభక్తి గీతాలు రాసిన కవి ప్రదీప్, 1996లో తొలి తరం తమిళ అగ్ర హీరో శివాజీ గణేషన్, 1995లో కన్నడీగుల ఆరాధ్యనటుడు రాజ్‌ కుమార్, 1994లో బాలీవుడ్ తొలి తరం సూపర్ స్టార్ దిలీప్ కుమార్, 1993లో బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత మజ్రూ సుల్తాన్ పురి, 1992లో ప్రముఖ అస్సామీ గాయకుడు భారతరత్న భూపేన్ హజారికా, 1991లో ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడు నిర్మాత, దర్శకుడు బాల్జీ పెండార్కర్, 1990లో టాలీవుడ్ లెజండరీ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు, 1989లో గాన కోకిల భారతరత్న లతా మంగేష్కర్, 1988లో అశోక్ కుమార్, 1987లో ప్రముఖ నట గాయకుడు కిషోర్ కుమార్‌, 1986లో విజయా అధినేత బి.నాగిరెడ్డి, 1985లో ప్రముఖ మరాఠీ, హిందీ దర్శక, నిర్మాత మరియు హీరో అయిన వి.శాంతారామ్, 1984లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు భారతరత్న సత్యజిత్ రేలు దాదా సాహెబ్ పాల్కే అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఆస్కార్ తరుపున జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఏకైక భారతీయ వ్యక్తి సత్యజిత్ రే.

Before Amitabh Bachchan These Indian Film Legends Got Dada Saheb Phalke Award, “దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

ఇక 1983లో తొలి మరాఠీ టాకీ అయోధ్యాచ రాజాలో హీరోయిన్‌గా నటించిన దుర్గాఖోటే, 1982లో తొలి హిందీ టాకీ ఆలం అరా, తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ ‘కాళిదాసు వంటి సినిమాల్లో నటించిన ఏకైక వ్యక్తి ఎల్.వి.ప్రసాద్. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఫిల్మ్ స్టూడియో అధినేతగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ అధినేతగా సినిమాకు సంబంధించిన వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. 1982లో ఈయన్ని కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఇక 1981లో బాలీవుడ్ తొలి తరం సంగీత దర్శకుడు నౌషాద్ అలీ.. 1980లో తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, 1979లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత నటుడైన సోహ్రాబ్ మోడీ దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు. ఈయన షేక్ స్పియర్ నాటకాలను స్పూర్తిగా తీసుకొని తన సినిమాలను తెరకెక్కించాడు.

Related Tags