తగ్గిన బీర్ల అమ్మకాలు.. ఎందుకంటే..

చిల్డ్ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అంటారు మందుబాబులు. చల్ల చల్లని బీర్‌ను ఎంతగానో ఇష్టపడే మద్యం ప్రియులకు ఇప్పుడు బీర్ కాస్తా చేదెక్కినట్లుంది. ఎందుకంటే.. తెలంగాణ మద్యం అమ్మకాల..

తగ్గిన బీర్ల అమ్మకాలు.. ఎందుకంటే..
Follow us

|

Updated on: Aug 07, 2020 | 6:22 PM

చిల్డ్ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అంటారు మందుబాబులు. చల్ల చల్లని బీర్‌ను ఎంతగానో ఇష్టపడే మద్యం ప్రియులకు ఇప్పుడు బీర్ కాస్తా చేదెక్కినట్లుంది. ఎందుకంటే.. తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కలు చూస్తే అలానే ఉంది. ఆల్కహాల్ బెవరేజస్‌లో విపరీతంగా అమ్ముడుపోయిన ఆల్కహాల్ ఏదైనా ఉందంటే అది బీరే. గతంలో సీజన్ ఏదైనా బీర్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. ఇక  ఒక్కొక్కరు 3 నుంచి 6 బీరు బాటిళ్లు  కొనుగోలు చేసేవారు.

కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. బీర్‌కు ఇప్పుడు చాలా డిమాండ్ తగ్గింది. బీర్ తాగేవాళ్లు కూడా తగ్గారు. ఎందుకంటే కరోనా మహమ్మారి వ్యాప్తిగా చెందుతుండటం.. చల్లని బీర్ తాగితే జలుబు వచ్చే ఛాన్స్ ఉండటంతో భయంతో బీర్‌ను పక్కన పెట్టినట్లున్నారు బీరు బాబులు. ఈ కారణంగానే తెలంగాణలోని అన్ని నగరంలో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గాయని వైన్ షాప్ ఓనర్లు అంటున్నారు.

ఇక ఒక హైదరాబాద్ లోనే ఎంతలా బీర్ అమ్మకాలు ఎంతగా తగ్గాయంటే.. గతంలో కంటే చాలా అంటున్నారు ఆబ్కారీ అధికారులు. హైదరాబాద్‌లో బీర్ల విక్రయాలు తగ్గడానికి కారణాలను ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు. కరోనా కారణంగా జన్మదిన, వివాహ ఇతరత్రా వేడుకలు, విందులు వాయిదా పడటమే అని అంటున్నారు.

సరదాగా నలుగురు ఒకేచోట కూర్చొని తాగే అవకాశం కూడా లేకుండా పోవడం ఇందుకు కారణమని అంటున్నారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటం.. పార్టీలకు నో అంటున్నారని ఆబ్కారీ శాఖ అంచనాకు వచ్చారు.

గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగ్గా, బీరు అమ్మకాలు 22.99 లక్షల కేసులు జరిగాయి. లిక్కర్‌ అమ్మకాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నా.. బీరు అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ మాత్రం గత ఏడాది జులైలోని అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్లు పెరిగిందని అంటున్నారు.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.