బ్యూటీపార్లర్లు, సెలూన్లకు గ్రీన్ సిగ్నల్..రేపే ఓపెన్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్-4 కొనసాగుతోంది. కానీ దేశంలో కేసుల సంఖ్య మాత్రం తగ్గక పోగా పెరుగుతూనే ఉంది. అయినా కూడా అనేక రాష్ట్రాల్లో సండలింపులూ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బ్యూటీపార్లర్లు, సెలూన్లకు గ్రీన్ సిగ్నల్..రేపే ఓపెన్
Follow us

|

Updated on: May 23, 2020 | 1:13 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్-4 కొనసాగుతోంది. కానీ దేశంలో కేసుల సంఖ్య మాత్రం తగ్గక పోగా పెరుగుతూనే ఉంది. అయినా కూడా అనేక రాష్ట్రాల్లో సండలింపులూ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసుకునేందుకు పళనిస్వామి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి సెలూన్లు, బ్యూటీ పార్లర్లు అందుబాటులోకి రానున్నాయి. బార్బర్స్ నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్లకు సెలూన్లు తిరిగి ఓపెన్ చేసుకునేందు మే 19 న అనుమతించిన పళనిస్వామి ప్రభుత్వం తాజాగా లేడీస్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు ఓపెన్ చేసుకునేందుకు ఓకే చెప్పింది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

భౌతిక దూరం పాటిస్తూ…ఆదివారం నుంచి షాపులు ఓపెన్ చేసుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కొన్ని నిబంధనలు మాత్రం తప్పక పాటించాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా.. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పని సరిగా ధరించాలి. షాపులు రోజుకు కనీసం ఐదుసార్లు శానిటైజ్ చేయాలని సూచించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చని తెలిపింది. అయితే, ఎయిర్ కండిషనింగ్ కు మాత్రం అనుమతి లేదని పేర్కొంది. ఈ అనుమతులు గ్రేటర్​ చెన్నైతో పాటు కంటైన్ మెంట్ జోన్లకు వర్తించవని స్పష్టం చేసింది. మరోవైపు, కంటైన్ మెంట్ జోన్లలో నివాసం ఉండేవాళ్లను సెలూన్లలో పనిచేయడానికి అనుమతించకూడదని షాపుల యజమానులకు ప్రభుత్వం సూచించింది. అలాగే, కరోనా లక్షణాలు కలిగిన ఏ కస్టమర్​ను షాపులోకి అనుమతించవద్దని చెప్పింది.