Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం…

ఉసిరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది…  అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం.

1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ముడుతలు తొలుగుతాయి.

2. ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, బాదంపేస్ట్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.

3. కుంకుమపువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది. కుంకుమపువ్వు, పాల మిశ్రమం ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో చర్మం మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

4. కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమ ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

5. అలోవెర, బియ్యంపిండి, టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే ముఖం అందంగా కనబడుతుంది.

6. పాలు, కుంకుమపువ్వు రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఐప్లె చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మానికి తగిన హైడ్రేషన్ అందుతుంది. అంతేకాకుండా చర్మానికి తగిన మాయిశ్చరైజర్ అందుతుంది. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.