వాఘా సరిహద్దులో… ఘనంగా భారత్-పాక్ ‘బీటింగ్ రిట్రీట్’!

Beating retreat ceremony at the Attari-Wagah border on the eve of Independence day

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అట్టారి సరిహద్దులో నేడు భారత్-పాక్ దళాలు నిర్వహించిన ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక ఘనంగా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేగా ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న వాఘా-అటారీ సరిహద్దు పోస్టు వద్ద స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జరిగే ప్రత్యేక బీటింగ్ రిట్రీట్‌ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్దఎత్తున్న ప్రజలు వస్తుంటారు. సూర్యాస్తమయం సమయంలో ఇరుదేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ పోస్టును మూసివేసే ముందు సరిహద్దును కాపలా కాసే బీఎస్‌ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ కవాతును నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇరువైపులనుంచి ప్రజలు భారీగా వస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *