Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

కోతిమూకలను బెదరగొట్టిన ఎలుగు మనిషి !

Group of Monkeys Causing Inconvience, కోతిమూకలను బెదరగొట్టిన ఎలుగు మనిషి !
అడవులు వదిలి మైదానం బాటపట్టిన కోతులు..జనావాసాల్లో చేరి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలకు మందలుగా చేరిన కోతులు..పల్లెపట్నం తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతిచేష్టలతో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వాలను సైతం కోటి కష్టాలకు గురిచేస్తున్నాయి. అనేక జిల్లాలో ఇళ్లు, పంట పొలాలపై పండి విధ్వంసం చేస్తున్నాయి.
కోతుల దాడుల్లో గాయాల పాలైన వారు ఊరూరా పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఊర్ల మీద పడుతున్న కోతులను ఇదివరకటిలా కొండముచ్చులను తెచ్చి బెదిరించినా ఫలితం లేకుండా పోతోంది.. వానరాలను భయపెట్టేందుకు కొందరు రైతులు తమ పొలాల్లో పులిబొమ్మలు ఏర్పాటు చేశారు. కొందరు డప్పులు వాయిస్తూ శబ్ధాలు చేస్తూ తరిమికొట్టేప్రయత్నం చేశారు. కుక్కలతో దాడి చేయిస్తారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కోతిమూకను తరిమికొట్టే ఉపాయాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ రైతు సరికొత్త పథకం వేశాడు. కొండముచ్చులకు కూడా బెదరని కోతుల తిక్క కుదర్చటానికి వెరైటీగా ఓ వ్యక్తిని ప్రత్యకించి ఏర్పాటు చేశాడు. అతనికి ఎలుగుబంటి వేశం కట్టించి ఊరంతా తిప్పుతున్నాడు. ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఆ విచిత్ర జంతువును చూసిన కోతులు కూడా భయంతో తోకముడుచుకుని పారిపోతున్నాయి.
Group of Monkeys Causing Inconvience, కోతిమూకలను బెదరగొట్టిన ఎలుగు మనిషి !