వరంగల్‌లో హల్‌చల్ చేసిన ఎలుగుబంటి

జనగాం జిల్లాలో ఓ ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. అడవిలోంచి జనావాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనగాం జిల్లాలోని స్థానిక బస్టాండ్ ఆవరణలోని అర్థరాత్రి  2 గంటలకు ఓ చెట్టు ఎక్కింది ఎలుగుబంటి. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చెట్టెక్కిన ఎలుగుబంటి ఎంతకీ కిందకు దిగకపోవడంతో జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టుపై ఎలుగుబంటి ఎక్కడంతో వాహనదారులు కూడా భయాందోళన చెందారు. జనావాసాల్లోకి ఎలుగుబంటి ప్రవేశించందన్న […]

వరంగల్‌లో హల్‌చల్ చేసిన ఎలుగుబంటి
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 1:27 PM

జనగాం జిల్లాలో ఓ ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. అడవిలోంచి జనావాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనగాం జిల్లాలోని స్థానిక బస్టాండ్ ఆవరణలోని అర్థరాత్రి  2 గంటలకు ఓ చెట్టు ఎక్కింది ఎలుగుబంటి. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చెట్టెక్కిన ఎలుగుబంటి ఎంతకీ కిందకు దిగకపోవడంతో జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు.

వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టుపై ఎలుగుబంటి ఎక్కడంతో వాహనదారులు కూడా భయాందోళన చెందారు. జనావాసాల్లోకి ఎలుగుబంటి ప్రవేశించందన్న సమాచారాన్ని అందుకున్న వరంగల్ ఫారెస్ట్ అధికారులు దానిని బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు ఇలా సిటీల్లోకి రావడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. అర్థరాత్రి నుంచి ఎలుగుబంటి చెట్టుపైనే కూర్చోవడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో తెలియక జనాలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు మండిపోవడంతో.. అడవుల్లో నీరు లభించక.. నీళ్లు తాగేందుకు ఇలా జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.