Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

‘ ఎలుగు మనిషి ‘ ఉదంతం తుస్సుమంది

, ‘ ఎలుగు మనిషి ‘ ఉదంతం తుస్సుమంది

రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జా‍ండ‌ర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడుతున్నాడని, మతి మరపుతో బాటు కొంతవరకు మతి స్థిమితం లేదని ఆయన తెలిపాడు. ఎలుగుబంటి ఇతడ్ని గాయపరచినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించాడు. కొందరు వేటగాళ్ళు ఇతడిని ఓ ఎలుగుబంటి గుహలో చూశారని, తాను నెలరోజులుగా ఈ గుహలో ఉన్నట్టు అతగాడు చెప్పాడంటూ వారు ఓ వీడియో తీయడంతో అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇదంతా వట్టి పుకారేనని రుస్తం స్పష్టం చేశాడు. తన రోగి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, అతడ్ని అతడి తల్లి వఛ్చి వారి ఇంటికి తీసుకువెళ్ళిందని ఆయన వెల్లడించాడు. ఈ ఉదంతంలో… వీడియోను తీసినవారిపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కజకిస్తాన్ లోని యాక్తాబ్ మెడికల్ సెంటర్ అనే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ రోగి అసలు ఆ గుహలోకి ఎలా వెళ్లాడన్నది మిస్టరీగా మారింది.

Related Tags