వెలిగొండ రిజర్వాయర్ వద్ద ఎలుగుబంటి హల్‌చల్

కర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఫారెస్ట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా తెలుగుగంగ రిజర్వాయర్ డ్యాం నీటిలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు.  అయితే నీటిలో నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి ఫారెస్ట్ […]

వెలిగొండ రిజర్వాయర్ వద్ద ఎలుగుబంటి హల్‌చల్
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 12:04 PM

కర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఫారెస్ట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా తెలుగుగంగ రిజర్వాయర్ డ్యాం నీటిలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు.

అయితే నీటిలో నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసింది. అటవీశాఖ ప్రొడక్షన్ వాచర్ కుమార్‌ను మెడపట్టి నీళ్లలోకి లాక్కెల్లింది. దీంతో స్థానికులు, అటవీశాఖ సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో అతడిని వదిలేసి సమీపంలోకి పొలాల్లోకి పరుగుదీసింది. దాడి జరిగిన వెంటనే కుమార్‌ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మరోవైపు తప్పించుకున్న ఎలుగుబంటిని బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు.