గర్భగుడిలోకి ప్ర‌వేశించిన‌ ఎలుగుబంటి, ఏం చేశారంటే !

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామం ద‌గ్గ‌ర్లో ఉన్న పోచమ్మ టెంపుల్ గర్భగుడిలోకి శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి ప్ర‌వేశించింది.

గర్భగుడిలోకి ప్ర‌వేశించిన‌ ఎలుగుబంటి, ఏం చేశారంటే !
Follow us

|

Updated on: Aug 02, 2020 | 10:26 AM

Bear Spotted At Temple : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామం ద‌గ్గ‌ర్లో ఉన్న పోచమ్మ టెంపుల్ గర్భగుడిలోకి శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి ప్ర‌వేశించింది. ఆక‌లితో ఉన్న ఎలుగుబంటి..గ‌ర్బ‌గుడిలో ఉన్న‌ కొబ్బరి చిప్ప‌లు గ‌మ‌నించి చొర‌బ‌డింది. గుడి వద్ద పడుకున్న ఓ రైతు దాన్ని గమనించి…జాగ్ర‌త్తగా త‌లుపుల‌కు తాళం వేసి.. బంధించాడు. అనంత‌రం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. శనివారం సాయంత్రం రెస్క్యూ టీమ్ అక్క‌డికి చేరుకుంది. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ తుపాకీ ద్వారా మత్తు ఇంజెక్షన్‌ వేయగా..ఎలుగుబంటి మత్తులోకి జారుకుంది. అనంతరం దాన్ని బోనులోకి ఎక్కించి అడవిలో వదిలిపెట్టేందుకు వరంగల్‌కు తరలించారు.

Also Read :  గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు