Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత . 70 గ్రాముల కొకెయిన్ పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు . తిరుమలగిరి లో తరుణ్ , అమిత్ లను పట్టుకున్న అధికారులు . మాస్క్ లకోసం బెంగుళూర్ కు ఇంటర్స్టెట్ పాస్ తో వెళ్లిన యువకులు . బెంగుళూర్ లో నైజీరియన్ దగ్గర కోకయున్ తెచ్చుకున్న యువకులు.

బీన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ తగ్గుముఖం

, బీన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ తగ్గుముఖం

బీన్స్‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఈ క్ర‌మంలో త‌ర‌చూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే దాంతో వారి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయ‌ని సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అందువ‌ల్లే బీన్స్‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు.. బీన్స్ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌తోపాటు అధిక బ‌రువును కూడా తగ్గించుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. అయితే బీన్స్‌ను ఉడ‌కబెట్టుకుని తిన‌డం శ్రేయ‌స్క‌రం. ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తిన‌రాదు. ఉడికించి తింటేనే పైన చెప్పిన లాభాలు ఉ౦టాయి.

Related Tags