Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇక..!

BCCI To Scrap IPL Opening Ceremony Calls It

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ వేడుకలను.. బీసీసీఐ రద్దు చేయాలనుకుంటుందట.

ప్రారంభ వేడుకలకు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతోందని.. అందులోనూ.. అభిమానులు కూడా వీటిపై ఆసక్తి చూపకపోవడంతోనే.. వీటిని రద్దు చేయాలనుకుంటుందట.. బీసీసీఐ. అలాగే.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటీనటులకు, కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని.. అందులో ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్రారంభ వేడుకలు లేకుండా.. టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని.. ఓ అధికారి తెలిపారు. అలాగే.. మరోకారణమేమంటే.. పూల్వామా ఉగ్రదాడిలో పలువురు జవాన్లు అమరులు అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి సీఓఏ వేడకలను రద్దు చేసి.. ఆ మొత్తం ఖర్చులో సగం భారత సైన్యానికి విరాళం ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలానే చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

BCCI To Scrap IPL Opening Ceremony Calls It