అభినందన్‌‌కు బీసీసీఐ సూపర్ గిఫ్ట్

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు పాకిస్థాన్‌ చెరలో బంధీగా ఉండి భారత్‌లోకి అడుగు పెట్టిన అభినందన్‌కు బీసీసీఐ ఘన స్వాగతం పలికింది. అభినందన్ పేరు మీద కొత్తగా టీమిండియా జెర్సీని విడుదల చేస్తూ వెల్‌కమ్ చెప్పింది. నెంబర్ వన్ అంకెతో ముద్రించి ఉన్న ఆ జెర్సీపై వింగ్ కమాండర్ అభినందన్ అని రాసి ఉంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ హత్తుకునేలా చక్కని సందేశాన్ని పోస్ట్ పెట్టింది. స్వదేశానికి స్వాగతం అభినందన్.. మీరు ఆకాశాన్ని జయించారు, […]

అభినందన్‌‌కు బీసీసీఐ సూపర్ గిఫ్ట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 9:18 PM

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు పాకిస్థాన్‌ చెరలో బంధీగా ఉండి భారత్‌లోకి అడుగు పెట్టిన అభినందన్‌కు బీసీసీఐ ఘన స్వాగతం పలికింది. అభినందన్ పేరు మీద కొత్తగా టీమిండియా జెర్సీని విడుదల చేస్తూ వెల్‌కమ్ చెప్పింది. నెంబర్ వన్ అంకెతో ముద్రించి ఉన్న ఆ జెర్సీపై వింగ్ కమాండర్ అభినందన్ అని రాసి ఉంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ హత్తుకునేలా చక్కని సందేశాన్ని పోస్ట్ పెట్టింది.

స్వదేశానికి స్వాగతం అభినందన్.. మీరు ఆకాశాన్ని జయించారు, మా హృదయాలను జయించారు. మీ ధైర్య సాహసాలు తరతరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇట్లు టీమిండియా.. అంటూ ఆ వీరుడిని కీర్తించింది. సోషల్ మీడియాలో బీసీసీఐ పెట్టిన ఈ పోస్ట్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. షేర్లు, లైక్‌లు, కామెంట్లతో హోరెత్తింది. పలువురు నెటిజన్లు స్పందిస్తూ అవును అభినందన్ మా హృదయాలను గెలుచుకున్నారు, జై హింద్, భారత్ మాతాకీ జై అంటూ విపరీతంగా కామెంట్లు వచ్చాయి.