టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆరుగురు

Ravi Shastri and Mike Hesson Among Six Names Shortlisted By BCCI For Team Indias Head Coach Position, టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆరుగురు

టీమిండియా హెడ్ కోచ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని బీసీసీఐ పరిశీలించింది. అందులో ఆరుగుర్ని ఇంటర్వూకి ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోకుండానే అతడు ఇంటర్వూకి హాజరయ్యే అవకాశం ఉంది. రవిశాస్త్రితో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్, భారత జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్‌ ఉన్నారు.

ఇక టీమిండియా హెడ్ కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతను బీసీఐ పాలకుల కమిటీ.. క్రికెటర్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీకి అప్పగించింది. ఆగష్టు 16న ముంబయిలో వీరందరికీ ఇంటర్వూ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *