ఇకపై క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి..!

ఇంతకాలం ఒలింపిక్స్ కే పరిమితమైన డోపింగ్ టెస్టులకు ఇక క్రికెట్ లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత క్రీడాకారులు ఎవ్వరైనా ఒలింపిక్స్ పాల్గొనాలంటే డోపింగ్ టెస్ట్‌లు పాస్ కావడం తప్పనిసరి. నిషేధిత ఉత్పేరకాలు వాడినట్టు రుజువైతే… వారిపై వేటు విధిస్తారు. కొన్నిసార్లు గెలిచిన పతకాలను కూడా వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి. అయితే, క్రికెటర్లకు మాత్రం ఈ పరీక్ష నిర్వహించడాన్ని తప్పుబడుతూ వచ్చింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు ముందు ఈ ప్రతిపాదన తెచ్చింది జాతీయ డోపింగ్ వ్యతిరేక […]

ఇకపై క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి..!
Follow us

|

Updated on: Jul 31, 2020 | 5:16 AM

ఇంతకాలం ఒలింపిక్స్ కే పరిమితమైన డోపింగ్ టెస్టులకు ఇక క్రికెట్ లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత క్రీడాకారులు ఎవ్వరైనా ఒలింపిక్స్ పాల్గొనాలంటే డోపింగ్ టెస్ట్‌లు పాస్ కావడం తప్పనిసరి. నిషేధిత ఉత్పేరకాలు వాడినట్టు రుజువైతే… వారిపై వేటు విధిస్తారు. కొన్నిసార్లు గెలిచిన పతకాలను కూడా వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి. అయితే, క్రికెటర్లకు మాత్రం ఈ పరీక్ష నిర్వహించడాన్ని తప్పుబడుతూ వచ్చింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు ముందు ఈ ప్రతిపాదన తెచ్చింది జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా). అప్పట్లో క్రికెటర్లతో పాటు బోర్డు కూడా ఈ ప్రతిపాదను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తాజాగా ఐసీసీ ఛైర్మెన్ శశాంక్ మనోహర్‌తో జరిగిన సమావేశంలో మరోసారి ఈ పరీక్ష తెరపైకి వచ్చింది. దీనిపై బీసీసీఐ అడ్మినిస్టేషన్ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రస్తుతం ఆరు నెలల కాలానికి ఓ ట్రయల్ పద్ధతిలో నాడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది బీసీసీఐ.

భారత క్రికెట్ బోర్డు, జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ మధ్య జరిగిన ఈ పాక్షిక ఒప్పందం ప్రకారం క్రికెటర్ల బ్లడ్ శాంపిల్స్‌ను నాడాకు చెందిన జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి పంపి పరీక్షిస్తారు. ఈ పరీక్షలను అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) కూడా పర్యవేక్షించనుంది. అయితే శాంపిల్స్ సేకరణ దగ్గర నుంచి పరీక్ష ఫలితాల దాకా ప్రతిదీ బీసీసీఐ పర్యవేక్షణలో జరగాలని నిర్ణయించారు. ఒకవేళ ఆరు నెలల కాలంలో నాడాతో సంతృప్తి చెందకపోయినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఒప్పందాన్ని పొడగించబోమని చెప్పేశారు బీసీసీఐ అధికారులు.

ఒలింపిక్స్ సమయంలో, కామన్వెల్త్ గేమ్స్ సమయంలో క్రీడాకారుల డోప్ పరీక్షల్లో అనేక పొరపాట్లు జరిగాయి. ఈ పొరపాట్ల కారణంగా ఎందరో మోస్ట్ టాలెంటెడ్‌ ప్లేయర్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం 10 శాతం శాంపిల్స్ నాడాకు అందించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి టాప్ ప్లేయర్స్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల నమూనాలు కూడా సేకరిస్తారు. ఇంతకుముందు జాతీయజట్టుకు ఎంపిక కావాలంటే యో-యో ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతే సరిపోయేది. ఇకపై ఈ డోప్ పరీక్ష కూడా తప్పకసరిగా పాస్ కావల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.