యూఏఈలో ఐపీఎల్ టోర్నీకి బీసీసీఐ ఫ్లాన్..?

కరోనా కల్లోలంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. మనదేశంలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌ అయ్యే చాన్సే కనిపించడంలేదు. అయితే ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించేందుకు భారత క్రికెట్ కౌన్సిల్ భారీగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగనుంది.

యూఏఈలో ఐపీఎల్ టోర్నీకి బీసీసీఐ ఫ్లాన్..?
Follow us

|

Updated on: Jul 16, 2020 | 4:30 PM

కరోనా కల్లోలంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. మనదేశంలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌ అయ్యే చాన్సే కనిపించడంలేదు. అయితే ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించేందుకు భారత క్రికెట్ కౌన్సిల్ భారీగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగనుంది.

దేశంలో కరోనా వైరస్‌‌‌‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఒక్క బాల్ కూడా పడే పరిస్థితులు లేవు. దీంతో ఐపీఎల్‌‌‌‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ను నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటి ఓ దఫా చర్చలు కొలిక్కి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

అలాగే, క్రికెటర్ల ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ను కూడా యూఏఈకి తరలించాలని క్రికెట్ కౌన్సిల్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌‌‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30 నుంచి 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొననున్నారు. ట్రయినింగ్ క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు. ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్‌‌‌‌ 26 నుంచి నవంబర్‌‌‌‌ 8 వరకు ఐపీఎల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ కనిపిస్తోంది. ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే.. ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు భారత్ టీంను ఎంపిక చేసే అవకాశముంది. ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌‌‌‌ నుంచి నేరుగా అస్ట్రేలియా చేరుకుంటారు. అయితే, బీసీసీఐ ప్లాన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావాలంటే ఇదంతా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌ నిర్వహణపై ఆధారపడి ఉంది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌పై ఐసీసీ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచిచూడాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించి అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌ జరుగనుంది. బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో జరుగనున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌ రద్దు కావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో యూఏఈలో ఐపీఎల్‌‌‌ టోర్నమెంట్ నిర్వహించేలా బిగ్ ఫ్లాన్ చేస్తోంది బీసీసీఐ.