BCCI Hints IPL Franchise Cost: ఐపీఎల్‌తో బీసీసీఐ భారీ సంపాదన కొత్త ఫ్రాంచైజీల కోసం ఎన్ని వందలకోట్లు చెల్లించాలో తెలుసా..

దేశవిదేశాల క్రికెటర్లను ఒక జట్టుగా కురుస్తూ.. పొట్టి క్రికెట్ ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత అనిపించుకుంది. ఆట పరంగానే కాదు ఆదాయ పరంగానూ ఐపీఎల్‌కు సాటిరాగల క్రికెట్‌ లీగ్‌ ప్రపంచంలో ..

BCCI Hints IPL Franchise Cost: ఐపీఎల్‌తో బీసీసీఐ భారీ సంపాదన కొత్త ఫ్రాంచైజీల కోసం ఎన్ని వందలకోట్లు చెల్లించాలో తెలుసా..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 7:21 PM

BCCI Hints IPL Franchise Cost: క్రికెట్ స్వరూపాన్ని మార్చేసింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. దేశవిదేశాల క్రికెటర్లను ఒక జట్టుగా కురుస్తూ.. యువకుల ప్రతిభను వెలికి తీయడంలో మేటి అంటూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐపీఎల్ పై ఎన్ని నీలినీడలు పడినా ఇప్పటికీ యూత్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్ వస్తుందంటే చాలు.. టీవీకి అతుక్కుపోయే క్రికెట్ అభిమానులు రోజురోజుకీ పెరుగుతున్నారు ఇదే విషయాన్ని ఐపీఎల్ 2020 రుజువు చేసింది.

ఇక ఈ పొట్టి క్రికెట్ ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత. ఆట పరంగానే కాదు ఆదాయ పరంగానూ ఐపీఎల్‌కు సాటిరాగల క్రికెట్‌ లీగ్‌ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ లీగ్ ద్వారా బీసీసిఐ భారీ ఆదాయాన్ని సంపాదిస్తుంది. మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసార హక్కుల నుంచి ప్రకటనల వరకు ప్రతి అంశాన్ని భారీ స్థాయిలో మార్కెట్ చేస్తుంది. భారీగా ఆర్జిస్తోంది కూడా. ఈ లీగ్ లో ప్రస్తుతం ఎనిమిది జట్లు ఉన్నాయి. అయితే 2022కు పది జట్లు కానున్నాయి. అయితే ఈ జట్ల ఫ్రాంచైజీల కనీస ధర సైతం భారీ స్థాయిలోనే ఉంటుందని బీసీసీఐలోని ఓ అధికారి చెప్పారు.

ఇప్పటికే జరిగిన బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశంలో కొత్త ఫ్రాంచైజీల గురించి సభ్యులు అనధికారికంగా చర్చించారన్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఫ్రాంచైజీల కోసం టెండర్లు ఆహ్వానిస్తారని.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.1500-1600 కోట్లు ఉంటుందని చెప్పారు. ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ, మిగిలిన ఫ్రాంచైజీల పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువ మొత్తమేనని అన్నారు. టెండర్ల కాల ప్రకియ, కనీస ధరను ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయిస్తుందని ఆ అధికారి తెలిపారు. అయితే ఐపీఎల్ 2021 కు సంబంధించిన వేలం పాట ఫిబ్రవరిలో ఉండవచ్చునన్నారు.

Also Read: మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా మారనున్న అక్కినేని వారసుడు..?