BCCI AGM AGENDA: సమావేశమవనున్న బీసీసీఐ… 23 ఎజెండా అంశాలపై చర్చ… కొత్త ఐపీఎల్ టీంల ఏర్పాటు ప్రస్తావన…

భారత క్రికెట్ నియంత్రణ మండలి  89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 24న అహ్మదాబాద్‌లో నిర్వహించనుంది.

BCCI AGM AGENDA: సమావేశమవనున్న బీసీసీఐ... 23 ఎజెండా అంశాలపై చర్చ... కొత్త ఐపీఎల్ టీంల ఏర్పాటు ప్రస్తావన...
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2020 | 11:17 AM

భారత క్రికెట్ నియంత్రణ మండలి  89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 24న అహ్మదాబాద్‌లో నిర్వహించనుంది. బీసీసీఐ అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కాగా, 23 ఎజెండా అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. అయితే, గత కొంత కాలంగా విరుద్ధ ప్రయోజనాల కేసులో గంగూలీ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఎటువంటి చర్చ జరిగే అవకాశం లేదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కొత్త ఐపీఎల్ టీంలకు ఆమోదం…

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 23 అంశాలు చర్చకు రానుండగా… ప్రధానంగా ఐపీఎల్‌లో మరో రెండు కొత్త టీంల ఏర్పాటు, టీ20 ప్రపంచ కప్పు నిర్వహణ, ట్యాక్స్ తగ్గింపు, బోర్డులో నూతన సభ్యుల నియామకం, ఒలంపిక్స్‌లో క్రికెట్‌ ఆటను ప్రవేశపెట్టాలనే డిమాండ్లపై సమావేశంలో చర్చించనున్నారు.