Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

‘ఎ’ గ్రేడ్‌‌కు పంత్…‘ఎ+’ నుంచి ధావన్‌, భువి ఔట్

, ‘ఎ’ గ్రేడ్‌‌కు పంత్…‘ఎ+’ నుంచి ధావన్‌, భువి ఔట్

ముంబయి: 2018-19 సంవత్సరానికి గాను బిసిసిఐ ఇండియన్ ప్లేయర్స్‌కు కాంట్రాక్ట్ గ్రేడ్స్ ఎలాట్ చేసింది. మొత్తానికి రిషబ్ పంత్ పడిన కష్టానికి ఫలితం లభించింది. బీసీసీఐ అతడికి ‘ఎ’ గ్రేడ్‌ ప్లేయర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దీని విలువ ఒక్క ఏడాదికి రూ. 5 కోట్లు. 21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది ‘ఎ’ గ్రేడ్‌లోనే.

బీసీసీఐ గతేడాది ‘ఎ+’ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రూ.7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు. నిరుడు ఈ విభాగంలో ఐదుగురు ఉండగా.. ఈసారి ముగ్గురే ఉన్నారు. వాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా. గతేడాది ఇదే కాంట్రాక్ట్‌లో ఉన్న భువనేశ్వర్‌, ధావన్‌లు ‘ఎ+’లో చోటు కోల్పోయారు. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది. పుజారా గ్రేడ్‌-ఏలో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ గ్రేడ్‌ అయిన ‘ఎ’ గ్రేడ్‌ (రూ.50 లక్షలు)లో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి రూ.10 లక్షలు లభించే గ్రేడ్‌ ‘సి’లో ఉంది.

భారత ఆటగాళ్ల గ్రేడ్ల వివరాలు:
గ్రేడ్‌ ‘ఎ+’ (రూ.7 కోట్లు): కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా
గ్రేడ్‌ ‘ఎ’ (రూ.5 కోట్లు): పుజారా, రహానె, ధోని, ధావన్‌, షమి, ఇషాంత్‌, కుల్‌దీప్‌, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌
గ్రేడ్‌ ‘బి’ (రూ.3 కోట్లు): చాహల్‌, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌
గ్రేడ్‌ ‘సి’ (రూ.1 కోటి): మనీష్‌ పాండే, హనుమ విహారి, ఖలీల్‌ అహ్మద్‌, సాహా, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, అంబటి రాయుడు