దాదా మార్క్ నిర్ణయం, టీ20 ఆటగాళ్లకూ బీసీసీఐ కాంట్రాక్ట్, ​కనీసం పది టీ20లు ఆడితే..

భారత టీ20 ఆటగాళ్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది.  బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్​ నిబంధనలను సవరించించినట్లు తెలుస్తోంది.

దాదా మార్క్ నిర్ణయం, టీ20 ఆటగాళ్లకూ బీసీసీఐ కాంట్రాక్ట్, ​కనీసం పది టీ20లు ఆడితే..
Follow us

|

Updated on: Nov 20, 2020 | 6:07 PM

భారత టీ20 ఆటగాళ్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది.  బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్​ నిబంధనలను సవరించించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత్ తరఫున టీ20లు ఆడే ఆటగాళ్లకు సెంట్రల్​ కాంట్రాక్ట్​ పొందవచ్చు. ఇందుకు సదరు ప్లేయర్ కనీసం పది టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో వార్షిక కాంట్రక్ట్‌లు కేవలం వన్డే, టెస్టు ప్లేయర్స్‌కు మాత్రమే ఉండేవి.

సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ(సీఓఏ) గతంలోనే టీ20 ఫార్మాట్​ను ఒప్పందాల్లో చేర్చాలని సూచించినా.. బోర్డు అందుకు సమ్మతించలేదు. అయితే ఇప్పుడు గంగూలీ పాలకవర్గం ఈ మార్పునకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇక ప్రతి ఏటా ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రతిభ చూపుతోన్న ప్రాంతీయ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు గంగూలీ ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారతీయ క్రికెటర్లకు నాలుగు కేటగిరీల్లో కాంట్రాక్ట్​లు ఉంటున్నాయి. ఏ+ కేటగిరీలో ఉన్నవారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరిలో ఉంటే రూ.5 కోట్లు, బి కేటగిరిలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి వార్షిక వేతనంగా బీసీసీఐ ఇస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్​లో చోటు దక్కించుకోవాలంటే ఆటగాడు కనీసం 3 టెస్టులు లేదా 7 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాట్లో అద్బుతంగా రాణిస్తోన్నవారికి ఏ+ కేటగిరీలో చోటు కలిపిస్తారు.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..