Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • సిద్దిపేట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంబించనున్నారు .. కార్యక్రమానికి హాజరుకానున్న చిన జీయర్ స్వామి..
  • నేడు మరో రెండు పిటిషన్లపై విచారణ.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ.. ఇప్పటికే 49 మంది కి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. ఎల్జి పాలిమర్స్ కేసును విచారించిన ధర్మాసనం.
  • అమరావతి: నేడు కీలక తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు అంశంపై కీలక తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • టీ-20 వరల్డ్ కప్ సహా క్రికెట్ టోర్నమెంట్లపై ఎటూ తేల్చని ఐసీసీ. ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన నేటి సమావేశం. జూన్ 10న మరోసారి సమావేశమయ్యే అవకాశం. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్స్‌పై నేతల వ్యాఖ్యలు!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు
BC Reservations in Local Body Elections, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్స్‌పై నేతల వ్యాఖ్యలు!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్స్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు బిసి రిజర్వేషన్స్ పై జగన్ నిర్లక్ష్యం అని విమర్శించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బిసిలు టిడిపికి మద్దతు తెలిపారు. కానీ చంద్రబాబు 35 ఏళ్ల నుండి బీసీలను మోసం చేశారు. జగన్ నామినేటెడ్ పోస్టుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. 2018 లో ప్రభుత్వం కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణకి ఇచ్చిన తీర్పు మాకు వర్తిస్తుంది అని చంద్రబాబు ప్రభుత్వం వాదించింది. అయితే.. 50 శాతం కంటే ఎక్కవ రిజర్వేషన్ 2013 ఎన్నికల వరకే పరిమితం అని చంద్రబాబు అఫిడవిట్ దాఖలు చేశారు. తర్వాత ఎన్నికలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ వర్తించదు అని చంద్రబాబే పేర్కొన్నారు.

చంద్రబాబు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి తో కేసు వేయించారు. చంద్రబాబు హయాంలో ప్రతాప్ రెడ్డి ఉపాధి హామీ డైరెక్టర్ గా ఉన్నారు. బీసీలను మళ్లీ చంద్రబాబు మోసం చేస్తున్నారు బీసీలను తిట్టడానికి చంద్రబాబు పేటెంట్ ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరగక పోతే 4000 కోట్లు నిధులు వెనక్కి వెళతాయి. ఎన్నికలు ఆపి ఆ నాలుగు వేల కోట్ల నిధులు అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర. నిద్ర లేస్తే కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు కాలం గడుపుతున్నారు. యనమల కూడా బీసీలను మోసం చేస్తున్నారు, 2024 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్ల కూడా రావు. చంద్రబాబు ఎన్నికలకు వస్తే ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి తేలుతుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ.. ఎన్.పి.ఆర్ పై ప్రభుత్వం మాటాలు మోసం చేసేలా ఉన్నాయి. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాల గురించి ఒక్కసారైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? అని అన్నారు. సీఏఏ, ఎన్.పి.ఆర్ ను అమలు చేయమని కచ్చితంగా ప్రకటించాలి.. జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీతో మీకున్న సంబంధాలు ఒక్కొక్కటి బయపడుతున్నాయి. రాజ్యసభ సీటు కూడా ఎవరికి ఇస్తున్నారో తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ఎలా చెబుతోందో అలానే నడుచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారు. 2010నాటి ఎన్.పి.ఆర్ అమలు చేస్తామని రాజ పత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ 3రాజధానులు, శాననమండలి రద్దు కు వ్యతిరేకామని, తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం అని స్పష్టం చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. డీజీపీ 30 రోజుల వ్యవధిలో రెండుసార్లు హైకోర్టు గడపతొక్కారు. దాడులను ప్రోత్సహించే వారిపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం. ఎన్‍పీఆర్‍పై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ప్రజలు విశ్వసిస్తారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. బీసీ సంఘం నేతలతో కలిసి న్యాయ పోరాటం చేసే యోచనలో ఉన్నాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

Related Tags