‘భూతవిద్య’పై బీబీసీ కథనం.. బ్రిటిష్ హిందూ ప్రెస్ ఆగ్రహం!

ఇండియాను, హిందూయిజాన్ని బీబీసీ అపహాస్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మలు, దెయ్యాలే సబ్జెక్టుగా ఇండియాలోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రత్యేకంగా ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించబోతోందని, పారానార్మల్ యాక్టివిటీస్ మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుందని వచ్చిన వార్తలను బీబీసీ తన వెబ్ సైట్ లో ప్రచురించిన వైనం అప్పుడే వివాదాస్పదమైంది. ‘ ఇండియాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం.. ఘోష్ట్స్ పూనిన వ్యక్తులను డాక్టర్లు ఎలా ట్రీట్ చేస్తారో అనే విషయంపై కోర్సును నిర్వహించనుందని ‘ అంటూ […]

'భూతవిద్య'పై బీబీసీ కథనం.. బ్రిటిష్ హిందూ ప్రెస్ ఆగ్రహం!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 29, 2019 | 2:20 PM

ఇండియాను, హిందూయిజాన్ని బీబీసీ అపహాస్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మలు, దెయ్యాలే సబ్జెక్టుగా ఇండియాలోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రత్యేకంగా ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించబోతోందని, పారానార్మల్ యాక్టివిటీస్ మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుందని వచ్చిన వార్తలను బీబీసీ తన వెబ్ సైట్ లో ప్రచురించిన వైనం అప్పుడే వివాదాస్పదమైంది. ‘ ఇండియాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం.. ఘోష్ట్స్ పూనిన వ్యక్తులను డాక్టర్లు ఎలా ట్రీట్ చేస్తారో అనే విషయంపై కోర్సును నిర్వహించనుందని ‘ అంటూ .. ఆకుపచ్చని స్క్రబ్స్ ధరించిన వైద్యులు ఓ రోగికి సర్జరీ చేయడానికి సిధ్ధంగా ఉన్న ఫోటోను ఈ వెబ్ సైట్ ప్రచురించింది. అయితే ఈ కథనంపై తన ఫేస్ బుక్ లో స్పందించిన ‘ బ్రిటిష్ హిందూ ప్రెస్ అసోసియేషన్ ‘….. సంస్కృత పదమైన ‘ భూత విద్య ‘ అనే పదాన్ని ఇంగ్లీష్‌లో అనువదించడంలో బీబీసీ న్యూస్ విఫలమైందని ఆరోపించింది.

సైకోథెరపీకి, ఘోస్ట్ స్టడీస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియక అయోమయంలో పడ్డారని దుయ్యబట్టింది. ఈ తేడాని గుర్తించలేని సిబ్బంది బీబీసీలో ఉండడం దురదృష్టకరమని, సిగ్గుచేటని తిట్టిపోసింది. ఇదే విషయమై బ్రిటన్ లోని జాతీయ హిందూ దేవాలయాల మండలి ప్రధాన కార్యదర్శి సతీష్ కె. శర్మ మాట్లాడుతూ.. భారత దేశాన్ని, హిందూయిజాన్ని కించపరచడానికి చేసిన యత్నమే ఇదని అన్నారు. ఘోస్ట్ స్టడీస్ అన్నదానికి ఇక్కడ పూర్తి అర్థం ఇవ్వలేదని, ఇది ‘ సెన్సేషనల్ ట్రాన్స్ లేషన్ ‘ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ కోర్సును ఎగతాళి చేస్తూ.. కొంతమంది పోస్ట్ చేసిన ట్వీట్లను కూడా బీబీసీ సైట్ ప్రచురించింది. ఇలాంటి కోర్సు విషయంలో ఒకరు.. ఇండియాను చైనాతో పోలుస్తూ.. ‘ 6 జీ టెక్నాలజీలో చైనా (భారత్) రీసెర్చ్ ప్రారంభించిందని ‘ వ్యంగ్యంగా అభివర్ణించారు. మరొకరు.. ‘ రెస్టాఫ్ ది వాల్డ్.. బిగ్ డేటా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…. మెషిన్ లెర్నింగ్ ‘ అంటూ అపహాస్యం చేశారు.

కాగా-ఈ కోర్సు అంశంపై వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రతినిధి రాజేష్ సింగ్ వివరిస్తూ.. ఇది అష్టాంగ ఆయుర్వేదంలో ఒక భాగమన్నారు.ఇది సైకోసొమాటిక్ డిజార్దర్లను పరిష్కరించే విధానమని, ఆయుర్వేదంలో మహర్షి చరకుడు ప్రవచించిన అంశాల ఆధారంగా ఈ కోర్సు ఉంటుందని పేర్కొన్నారు. ఆయుర్వేదంలోని 8 విభాగాలను ఆయన తెలియజేస్తూ.. వీటిలో ఐదింటిని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇదివరకే ఆమోదించిందని గుర్తు చేశారు. (ఈ శాఖ ‘ ఆయుష్ ‘ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తోంది). ఈ కారణం వల్లే ఐఎంఎస్ (బీహెచ్ యు) పాలసీ, ప్లానింగ్ కమిటీ సిఫారసుపై ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్.. భూత విజ్ఞాన్, వజీకరణ, రసాయనాలపై ఆరు నెలల డిప్లొమాకోర్సును ఆమోదించిందని ఆయన చెప్పారు. ఈ కోర్సును స్వీకరించే విద్యార్థులకు సైకోసొనాటిక్ డిజార్దర్లను ఎలా ట్రీట్ చేయాలో నేర్పిస్తారని అన్నారు. ఆధునిక మెడికల్ సైన్స్ తో కూడా ఈ కోర్సుకు లింక్ ఉంటుంది అని రాజేష్ సింగ్ తెలిపారు. ఏ మోడరన్ మెడిసిన్ లేదా ఇండియన్ మెడిసిన్ లేక నర్సింగ్ కోర్స్ గ్రాడ్యుయేట్ అయినా ఈ కోర్సు చదవడానికి అర్హుడేనన్నారు. ‘మహర్షి చరకుడు రాసిన వ్యాసాల పైనే ఇది ఆధారపడి ఉంటుంది.. అంతే తప్ప.. పారా నార్మల్ స్టడీస్ పై కాదు ‘ అని ఆయన మళ్ళీ స్పష్టం చేశారు.

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే