Breaking News
  • ఇంద్రకీలాద్రి: నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ . ఉత్సవాల్లో భాగంగా ఇవ్వాళ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శమనివ్వనున్న దుర్గమ్మ. 9 గంటల నుంవి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి . కోవిడ్‌ ద్రుష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి . స్లాట్ లేని భక్తులకు అనుమతి నిరాకరణ . వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరణ..పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం . ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.
  • సిద్దిపేట; టీవీ9తో కత్తి కార్తీక (దుబ్బాక ఇండిపెండెంట్ అబ్యర్థి) రాజకీయ కక్షతోనే నాపై కేసులు నమోదు అవుతున్నాయి. అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో నేను ఎవరిని మోసం చేయలేదు. సదరు వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించాను.. మరి ఇప్పుడు పోలీసులు నాపై కేసు ఎలా నమోదు చేస్తారు. నా పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదు అయినట్టు నాకు సమాచారం లేదు.. మీడియా ద్వారానే నాకు తెలిసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను రాజకీయాలను వీడను.. 2023లో కూడా దుబ్బాక నుండే పోటీ చేస్తా. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడింది.
  • నేటి నుంచి శబరిమలలో భక్తులకు అనుమతి. పంబా చేరుకునే 48 గంటల ముందే భక్తులకు కరోనా పరీక్షలు. నెగెటివ్‌ వచ్చిన భక్తులను మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతి. ప్రతిరోజూ 250 మంది భక్తులకు మాత్రమే అవకాశం.
  • మరోసారి నోరుపారేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా, చైనా, భారత్‌ వంటి దేశాలు హానికర పదార్ధాలను విడుదల చేస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయన్న ట్రంప్. కరోనా విజృంభిస్తుండటంతో కీలక నిర్ణయం తీసుకున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యువల్‌ మెక్రాన్‌, ప్యారిస్‌ సహా ఫ్రాన్స్‌లోని 8 ఇతర నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు.
  • ప.గో: వివాహితను వేధిస్తోన్న ఐదుగురిపై కేసు నమోదు. మహిళ స్నానం చేస్తుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన యువకుడు. వీడియోను తన స్నేహితులకు పంపించిన యువకుడు. వీడియో అడ్డంపెట్టుకొని మహిళకు యువకుల వేధింపులు. కామవరపుకోట మండలం వీరంపాలెంలో ఘటన. బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు.
  • యూపీ: మహిళల భద్రతపై యోగీ సర్కార్‌ కీలక నిర్ణయం. మహిళలభద్రత, గౌరవం, స్వావలంభనపై దృష్టిపెట్టేలా ప్రత్యేక కార్యక్రమం. నేడు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రులు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం.
  • Tv9 తో మంత్రి శ్రీనివాస్ గౌడ్: టీవీ9 స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీవీ9 సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది. పోలీసులే కాదు మీడియా సంస్థలు కూడా ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా చేయాలి. టీవీ9 అందించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాం. చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయడానికి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తా. హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఎంత వారైనా, ఎంత పలుకుబడి ఉన్న శిక్ష తప్పదు. కొంత మంది ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సైబర్ క్రైమ్ సహకారంతో వారి ఆట కట్టిస్తున్నాం. తెలంగాణ వచ్చాక పేకాట క్లబ్ ల నుంచి గంజాయి వరకు అన్ని బందు చేశాం. దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు

BATHUKAMMA, ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ…కల్లలెరుగని తెలంగాణ ప్రజల సంబరం…పల్లె పల్లెన కనిపించే మహోత్సవం.. వెల్లివిరిసే పూల సమ్మేళనం.. వెదజల్లే మట్టి పరిమళం. ….బతుకమ్మ…ఒక అందమైన సంస్కృతిని ప్రతిబింబించే అపురూప దృశ్యం. తెలంగాణ విశిష్టతను చాటి చెప్పే సందర్భం…. యాంత్రిక జీవనంలో విసిగిపోయే మహిళలకు ఉల్లాసాన్ని మానసిక నవోత్తేజాన్ని అందించే పర్వదినం.. …బతుకమ్మ .. తరతరాల వారసత్వ వైభవం… ఆత్మీయ అనుబంధాల కదంబం… బతుకమ్మ….కులాల కట్టుబాట్లను చెరిపివేసి కలెగలుపుగా జరుపుకునే ఆనంద వేడుక… తొమ్మిది రోజుల పాటు సాగే ఆటపాటల పండుగ… నిన్నటి నుంచి ప్రారంభమైన బతుకమ్మ సంబరం చూసేవారికి సరికొత్తగా అనిపించింది.. ఆడపడచులు, మహిళలు మాస్క్‌లు ధరించి బతుకమ్మలాడటం కొత్తే కదా!

తెలంగాణ…సాంస్కృతిక ప్రత్యేకతలున్న నేల. ఇక్కడి భాష, యాస, ఆచారాలు, వ్యవహారాలు అన్నింటిలో జానపద ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పండుగలూ కూడా ప్రకృతి, వ్యవసాయం చుట్టూ అల్లుకుని వుంటాయి. బతుకమ్మ పండుగ అలాంటిదే! ఇది ముచ్చటైన పండుగ… మహోన్నతమైన పూల పండుగ.. పల్లె మనషుల నిండు మనుసులను చాటి చెప్పే పండుగ..బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక దర్పణం. తెలంగాణ ప్రజల జీవన విధానం అందులో ప్రతిబింబిస్తుంది. మానవసంబంధాలను నిలబెట్టి కొత్త జీవన స్ఫూర్తినిస్తుంది. బతుకమ్మ మనకు బతకడాన్ని నేర్పిస్తుంది.

BATHUKAMMA, ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ అచ్చంగా స్త్రీల పండుగ. అలా కనిపిస్తుంది. భాద్రపద అమావాస్యకు చాలా ప్రాముఖ్యత వుంది. పెద్దల అమావాస్య అనీ.. పెత్తరమాస అని పిలుస్తుంటారు. కాలంతో పరుగెత్తడం అలవాటయ్యాక తిథులను గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టమే! అందుకే అందరూ ఈ రోజు తమ పెద్దలకు, పితృదేవులకు పండుగ చేస్తారు. పల్లె సంబరం బొడ్డెమ్మ పండుగతో మొదలవుతుంది. నిజానికి ఈ ప్రాంత వాసులకు ఇది ఒక పండుగ కాదు. నాలుగు పండుగల మేళవింపు. బొడ్డెమ్మ పండుగ, పెద్దల పండుగ, బతుకమ్మ పండుగ, దసరా పండుగ.. ఈ నాలుగింటిని వరుసగా జరుపుతారు. ఇది ఒకరోజు సంబరం కాదు.. ఇరవై రోజుల ఉత్సవం.

BATHUKAMMA, ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు

భాద్రపద పంచమి రోజున మగవాళ్లు వెళ్లి పుట్టమన్ను తెస్తారు. ఇక్కడి ప్రజల సంస్కృతిలో పుట్టమన్నుకు ప్రత్యేక స్థానం వుంది. ఇంట్లో కొత్త పొయ్యి వెయ్యటానికి కూడా పుట్టమన్నే వాడుతారు. దుర్గమ్మ పండుగకు పుట్టమన్ను తెస్తారు. పుట్టమన్ను తడిపి ఒక చిన్న పీట మీద చతురస్రాకారంలో గుడి గోపురం మీద అంతురాలు చేస్తారు. వాటికి వరుసగా రంధ్రాలుంటాయి. పీటకు నాలుగు దిక్కులా నాలుగు చదరపు ముద్దలుంటాయి. వాటికి ఒక్కొక్క రంధ్రముంటుంది. దీన్ని బొడ్డెమ్మ అంటారు. బొడ్డె అంటే చిన్న కుప్ప లేదా రాశి. నిజానికి ఇది మట్టి పూజ. ఉత్పత్తి అంటే పంట.. పునరుత్పత్తి అంటే సంతానం సవ్యంగా సాగాలని చేసే పూజ. సాయంత్రం బొడ్డెమ్మను అలుకుతో కాని జాజుతో కాని తీర్చి దిద్దుతారు. మట్టి రంధ్రాలలో రంగు రంగుల రుద్రాక్ష, గోరింట, ముద్దాన్న పూలు పెట్టి అలంకరిస్తారు. సంధ్యవేల కూడలిలోనో, పెద్ద వాకిట్లోనో నడుమ పేడతో అలికి ముగ్గు వేస్తారు. మధ్యలో బొడ్డెమ్మలన్నీ పెట్టి చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు ఆడతారు. చీకటి పడిందాక ఆడి బొడ్డెమ్మలు తీస్తారు. నిదురపో బొడ్డెమ్మ నిదురపోవమ్మా.. నిద్రకు నూరేళ్లు, నీకు వెయేళ్లు అని పాటలతో నిద్ర పుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళతారు. ప్రతి సాయంత్రం ఇలా కొత్త అలుకు రాసి కొత్త పూలు అలంకరించి తొమ్మిది రోజుల తర్వాత పండుగ చేస్తారు. చివరి రోజు ఆట తర్వాత బొడ్డెమ్మలను బావిలో వేస్తారు.

పెత్తరమాస రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఇంటి చుట్టూ దొరికే పూలన్నీ సంబరంలో పాలు పంచుకుంటాయి. రంగు రంగుల పూలన్నింటినీ తీసుకొచ్చి హారతి పళ్లెంలో అందంగా పేరుస్తారు. తెలంగాణలో ఈ పళ్లాన్ని తబుకు అంటారు. మెట్టినింటికెళ్లిన ఆడబిడ్డలందర్ని ఆప్యాయంగా పుట్టింటికి తీసుకొస్తారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులతో, ఇంటి పనులతో, అత్తింటి ఆరళ్లతో అలసిపోయిన ఆడవాళ్లకు తల్లిగారింటి నుంచి వచ్చే పిలుపు గొప్ప ఊరటనిస్తుంది. పుట్టినిల్లు కావాల్సినంత విరామాన్నిస్తుంది. చుట్ట పక్కాలు, చిన్ననాటి స్నేహితులు, పలకరింపులు, ఆప్యాయతలు, అభిమానాలు కష్టాలను కడతేరుస్తాయి. కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. మొత్తానికి తొమ్మది రోజులూ సందడే. అందుకే పేద కుటుంబాలైనా సరే …ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు… తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఆడబిడ్డల ప్రేమ బంధాలను గట్టిపరిచే సందర్భం.

BATHUKAMMA, ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు

Related Tags