ఈ సారి 100 డిజైన్లలో బతుకమ్మ చీరలు.. 23 నుంచి పంపిణీ

Bathukamma sarees to be distributed from Sep 23 across Telangana, ఈ సారి 100 డిజైన్లలో బతుకమ్మ చీరలు.. 23 నుంచి పంపిణీ

తెలంగాణ ఆడపడుచుల కోసం కేసీఆర్ సర్కార్ దసరా కానుకలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ సారి మరింత నాణ్యమైనవి చేయించడంతో పాటుగా.. వందకు పైగా డిజైన్లలో చీరలను తయారు చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బతుకమ్మ చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శనకు ఉంచారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ప్రతి సారి బతుకమ్మ చీరలలో నాణ్యతతో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300కోట్లకు పైగా వెచ్చించిదన్నారు. అంతేకాదు వంద డిజైన్లలో ఈ సారి చీరలను తయారు చేయించినట్లు మంత్రి తెలిపారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. పద్దెనిమిది సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఆడ బిడ్డలందరికీ ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *