నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

Bathukamma Celebrations In Telangana, నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

తెలంగాణలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు.. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు రంగు రంగుల బతుకమ్మలతో చూడముచ్చటగా కనిపిస్తాయి. రానురాను విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు.

Bathukamma Celebrations In Telangana, నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సంబరాలు జరుపుతారు. కాగా, తొలిరోజు, చివరిరోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలో తొలిరోజు, చివరిరోజు ఎంతో ప్రత్యేకం. రకరకాల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను చేసి.. ఆలయాలు, పార్కులు వంటి ప్రదేశాల్లో.. ఆడపచులంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ కనువిందు చేస్తారు.

Bathukamma Celebrations In Telangana, నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

8 రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు:

1. ఎంగిపూల బతుకమ్మ- ఈ రోజు మహా అమావాస్యను పురస్కరించుకుని మొదటి బతుకమ్మను తయారుచేస్తారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని అంటారు. నువ్వులు, బియ్యపుపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ- 29.09.19: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండువ రోజు బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు.
3. ముద్ధపప్పు బతుకమ్మ- 30.09.19: ఇక మూడవ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
4. నానబియ్యం బతుకమ్మ- 01.10.19: నాలుగోరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

Bathukamma Celebrations In Telangana, నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?
5. అట్ల బతుకమ్మ- 02.10.19: ఇక ఐదవ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
6. అలిగిన బతుకమ్మ- 03.10.19: ఆరో రోజు ఆశ్వయుజ పంచమి వస్తుంది. నైవేద్యం ఏమీ సమర్పించరు.
7. వెన్న ముద్దల బతుకమ్మ- 04.10.19: ఇక ఏడవ రోజు నువ్వులు, వెన్న కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. సద్దుల బతుకమ్మ- 05.10.19: ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. మొత్తం ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం ప్రత్యేకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *