Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ మృతి

Basketball legend Kobe Bryant and his daughter Gianna Dead in Helicopter Crash, హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్  మృతి

పాపులర్ బాస్కెట్ బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. లాస్ఏంజిలిస్‌లోని కలా‌బాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది. వీరితో బాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సీకోర్సికీ ఎస్-76 హెలికాఫ్టర్ ఓ కొండను ఢీకొని మంటల్లో మండుతూ కూలిపోయింది. దట్టమైన మంచుతో కూడిన వాతావరణం అనుకూలించకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఆరెంజ్ కౌంటీ కాలేజ్ బేస్ బాల్ కోచ్ జాన్ అల్టోబెల్లి, ఆయన భార్య కేరి, వారి కూతురు అలీసా కూడా ఉన్నారు. 41 ఏళ్ళ కోబ్ బ్రయంట్.. బాస్కెట్ బాల్ క్రీడలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అయిదు సార్లు ఎస్‌బీ‌ఏ ఛాంపియన్‌గా గెలిచారు. రెండు సార్లు ఒలంపిక్ స్వర్ణ పతకాలను సాధించారు. పైగా తన కూతురు జియానాకు కూడా ఈ క్రీడలో మంచి  శిక్షణ   ఇచ్చారు.   తన సొంత హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతానని ఆయన ఏనాడూ ఊహించలేదు. కోబ్ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.Basketball legend Kobe Bryant and his daughter Gianna Dead in Helicopter Crash, హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్  మృతి

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రగాఢ సంతాపం:

కోబ్ బ్రయంట్ మృతి పట్ల ఇండియన్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న వీరు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ వార్త తమనెంతో బాధ కలిగించిందని’ పేర్కొన్నారు. ఇది చాలా విషాదకర దినమని రోహిత్ శర్మ అన్నాడు. వీరితో బాటు అభిషేక్ బచ్చన్, లారా దత్తా, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. 2016 లోనే రిటైర్మెంట్ తీసుకున్న కోబ్…   బాస్కెట్ బాల్ క్రీడా చరిత్రలోనే ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్నాడని వీరు పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

Life is fickle, it all eventually feels kind of pointless. R.I.P @kobebryant #blackmamba #24

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Basketball legend Kobe Bryant and his daughter Gianna Dead in Helicopter Crash, హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్  మృతి

Related Tags