బ్రేకింగ్: బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షలు రద్దు

ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌, ప్రథమ, ద్వితీయ, తృతీయ పరీక్షలను రద్దు చేస్తూ ట్రిపుల్‌ ఐటి బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెల్డ్‌ టెక్నాలజీస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సులకు సంబందించిన విద్యార్థులను వచ్చే సెమిస్టర్‌ కోసం నేరుగా ప్రమోట్‌ చేసింది. కేవలం పీయూసీ 2 పరీక్షలను మాత్రం...

బ్రేకింగ్: బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షలు రద్దు
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 7:18 PM

ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌, ప్రథమ, ద్వితీయ, తృతీయ పరీక్షలను రద్దు చేస్తూ ట్రిపుల్‌ ఐటి బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెల్డ్‌ టెక్నాలజీస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సులకు సంబందించిన విద్యార్థులను వచ్చే సెమిస్టర్‌ కోసం నేరుగా ప్రమోట్‌ చేసింది. కేవలం పీయూసీ 2 పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. ఈ నెల 18 నుండి ప్రారంభం కావాల్సి ఉన్న పీయూసీ-2 పరీక్షలను ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వాయిదా వేస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ రాహుల్ బొజ్జ స్పష్టం చేశారు. చివరి ఏడాది పరీక్షల విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులను‌ ఉత్తీర్ణులను చేయడంతో బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయిందని బాసర ట్రిపుల్ ఐటీ ఈవో రాజేశ్వర రావు తెలిపారు.

Read More: గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చిన హీరో ప్రభాస్..