ఒరేయ్ దండం పెడతా దింపరా బాబు: ఈ వీడియో చూస్తే నవ్వులే నవ్వులు

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు బ్రహ్మానందం ఇచ్చిన హావభావాలను అంత ఈజీగా ఎప్పటికీ మర్చిపోలేం. కోస్టర్ ప్రారంభం కావడానికి ముందు బీరాలు పలికే బ్రహ్మానందం.. పూర్తయ్యే సమయానికి బ్రతుకు జీవుడా అంటూ బేల మొహం వేస్తాడు. సరిగ్గా అలాంటి సీన్‌ జూలైలో మనాలిలో జరగ్గా.. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అందరి చేత కడుపుబ్బేలా నవ్వులు పూయిస్తోంది. యూపీలోని బండా ప్రాంతానికి చెందిన విపిన్ సాహు అనే ఔత్సాహికుడు మనాలి […]

ఒరేయ్ దండం పెడతా దింపరా బాబు: ఈ వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2019 | 3:16 PM

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు బ్రహ్మానందం ఇచ్చిన హావభావాలను అంత ఈజీగా ఎప్పటికీ మర్చిపోలేం. కోస్టర్ ప్రారంభం కావడానికి ముందు బీరాలు పలికే బ్రహ్మానందం.. పూర్తయ్యే సమయానికి బ్రతుకు జీవుడా అంటూ బేల మొహం వేస్తాడు. సరిగ్గా అలాంటి సీన్‌ జూలైలో మనాలిలో జరగ్గా.. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అందరి చేత కడుపుబ్బేలా నవ్వులు పూయిస్తోంది.

యూపీలోని బండా ప్రాంతానికి చెందిన విపిన్ సాహు అనే ఔత్సాహికుడు మనాలి ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేశాడు. కింద ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్న అతడి ఫేస్‌లో పైకి వెళ్తున్న కొద్దీ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. ఒకానొక సమయంలో తీవ్ర భయానికి లోనైన విపిన్.. ఇక అరవడం ప్రారంభించేశాడు. తనకు సహాయంగా వచ్చిన సహాయకుడిని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ‘‘ఇక చాలు నన్ను కిందికి దింపు భయ్యా’’ అంటూ హాహాకారాలు పెట్టాడు. అతడిని కామ్ చేసేందుకు సహాయకుడు ఎంత ప్రయత్నించినా విపిన్ మాత్రం భయంతో వణుకుతూనే ఉన్నాడు. అంతేకాదు కిందికి దింపేందుకు డబ్బులు కూడా ఇస్తానంటూ సహాయకుడికి  రూ.500 ఆఫర్ ఇచ్చాడు. ఇక ఎట్టకేలకు సహాయకుడు విపిన్‌ను కిందికి దింపగా.. బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు.  దీనికి సంబంధించిన వీడియోను అతడే షూట్ చేసుకోవడం విశేషం.

కాగా ఈ వీడియో ఆ తరువాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. విపిన్‌ చర్యకు సోషల్ మీడియాలో మీమ్స్ కూడా పేలుతున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో స్కైడైవింగ్ చేస్తానంటూ విపిన్ మరోసారి బీరాలు పలుకుతున్నాడు.