Breaking News
  • గుంటూరు: చిలకలూరిపేటలో జేఏసీ నిరసన దీక్ష. దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది-ప్రత్తిపాటి. నాపై, నారాయణపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు. కోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు-ప్రత్తిపాటి.
  • అమరావతి: ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది-కొల్లు రవీంద్ర. మండలి చైర్మన్‌ షరీఫ్‌పై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విశాఖ: తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. సబ్బవరం, భీమిలి తహశీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు.
  • ప.గో: 13 జిల్లాలు అభివృద్ధే సీఎం జగన్‌ ఆశయం-సామినేని ఉదయభాను. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ జరగాలి. మండలి చైర్మన్‌ బిల్లులను సలెక్టు కమిటీ పంపడం సరికాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఆలస్యం అవుతుంది-సామినేని ఉదయభాను.
  • అమరావతి: సా.4 గంటలకు గవర్నర్‌తో భేటీకానున్న చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బాబు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి. మండలి చైర్మన్‌పై మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు.

బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

, బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ ఒకటని చెప్పేందుకు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మకు ఇటీవల 60ఏళ్లు నిండాయి.

, బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

ఇన్ని ఏళ్లలో బార్బీ బొమ్మ వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా, అమెరికా ప్రెసిడెంట్‌గా.. ఇలా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందింది. అయితే తెలుపు రంగు, సన్నని శరీరంతో వస్తోన్న ఈ బొమ్మపై పలువురు కామెంట్లు చేస్తూ వచ్చారు. బార్బీ జాత్యాంహకార భావాలను రెచ్చగొడుతుందని కొంతమంది ప్రశిస్తూ వచ్చారు. వాటన్నింటిని పట్టించుకోని బార్బీ తయారి నిర్వాహకులు పలువురి రూపాలతో ఈ బొమ్మలను రూపొందించారు.

, బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

ఈ క్రమంలో ‘షేరో క్యాంపెన్’ పేరుతో అవ డువెర్నే, నాయోమీ ఒసాకా, ఎవా చెన్, ఇబ్తిహాజ్ ముహమ్మద్ పలువురి పోలీకలతో కూడిన బొమ్మలను బార్బీ తయారీ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అలాగే మరో ముందడుగు వేస్తూ 2016లో వివిధ శారీరక ఆకృతులతో, మరిన్ని హెయిర్ స్టైల్‌లతో, ఏడు శారీరక రంగులతో కొత్త కొత్త బొమ్మలను రూపొందించింది.

, బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

అంతేకాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా బార్బీ కీలక పాత్ర పోషిస్తోంది. బాబ్ మ్యాకీ, కార్ల్ లాగర్‌ఫెల్డ్, జెరెమీ స్కాట్ వంటి ప్రముఖ డిజైనర్లకు బార్బీ మోడల్‌గా పనిచేస్తోంది. దీనిపై బార్బీ సీనియర్ డిజైన్ డైరక్టర్ రాబర్ట్ బెస్ట్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ ట్రెండ్‌లో బార్బీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. మోడ్రన్ డ్రస్‌లు, కొత్త కొత్త హెయిర్ లుక్‌లతో ఫ్యాషన్ ప్రపంచంలో బార్బీ పోటి పడుతోంది ’’ అంటూ పేర్కొన్నారు.

, బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

కాగా 1959లో మొదటిసారిగా రుతూ హాండ్లర్ అనే వ్యక్తి ఈ బార్బీ బొమ్మలను సృష్టించాడు. మహిళల అభిప్రాయాలకు అనుగుణంగా బార్బీ బొమ్మలు ఎప్పుడూ రూపాంతరం చెందుతూనే ఉంటాయని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.