కస్టమర్లకు ముఖ్య గమనిక.. వచ్చే మూడు నెలల్లో బ్యాంకులకు 30 రోజులు సెలవులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజోరోజుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ 4లో సడలింపులు ఇవ్వడంతో

కస్టమర్లకు ముఖ్య గమనిక.. వచ్చే మూడు నెలల్లో బ్యాంకులకు 30 రోజులు సెలవులు..
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 11:42 AM

Banks getting 30 holidays in next 3 months: కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజోరోజుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ 4లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడు చాలా వరకు దుకాణాలు, ఆఫీసులు కూడా తెరుచుకున్నాయి. అయితే.. లాక్‌డౌన్‌లోనూ పనివేళల్లో మార్పులు ఉన్నప్పటికీ అన్ని బ్యాంకులూ పనిచేశాయి. కరోనా కాలంలోనూ వినియోగదారులకు సేవలందించాయి.

కాగా.. రాబోయే మూడు నెలల్లో బ్యాంకులకు 30 రోజులు సెలవులు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం జూన్, జులై, ఆగస్టులో శని, ఆదివారాలతో పాటు పండగలు కలుపుకుంటే దాదాపు 30 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అందుకే సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుంటే.. అందుకు అనుగుణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు. మరి జూన్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకులకు సెలవులు ఎప్పుడో ఇక్కడ చూడండి.

వివరాల్లోకెళితే.. జూన్ నెలలో శని ఆదివారాల కారణంగా జూన్ 7, 13, 14, 17, 23, 24, 30 రోజులలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటితో పాటు జూన్ 18న గురు హర్ గోబింద్ జీ జయంతి వలన చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. జులైలో శని ఆదివారాల కారణంగా జులై 5, 11, 12, 19, 25, 26 రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటితో పాటు జులై 31న బక్రీద్ వలన మరో సెలవు వచ్చింది.

ఇకపోతే.. ఆగస్టు నెలలో శని ఆదివారాల కారణంగా ఆగస్టు 2, 8, 9, 16, 22, 23, 29, 30 రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటితో పాటు ఆగస్టు 3న రక్షాబంధన్, 11న శ్రీకృష్ణ జన్మాష్టమి స్థానిక సెలవు, 12న శ్రీకృష్ణ జన్మాష్టమి గెజిటెడ్ హాలీడే, 15 స్వాతంత్ర దినోత్సవం, 21న తీజ్ లోకల్ హాలిడే, 22న వినాయక చవితి, 30న మొహర్రం గెజిటెడ్ హాలీడే, ఆగస్టు 31న ఓనమ్ లోకల్ హాలీడే ఉంటుంది.