జూలై నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు.. వివరాలివే..

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమయంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి జూలై నెలలో బ్యాంకు సెలవు రోజులు..

జూలై నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు.. వివరాలివే..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 8:33 AM

అన్‌లాక్ 1.0 ముగిసింది. ఇవాళ్టి నుంచి అన్‌లాక్ 2.0 మొదలైంది. దేశంలోని కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు వెలుపల కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలో బ్యాంకులు అన్ని వేళలా పని చేస్తున్నాయి. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమయంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి జూలై నెలలో బ్యాంకు సెలవు రోజులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని మీ పనికి ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కబెట్టుకోండి. ప్రతీ ఆదివారంతో పాటుగా రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకుని ఈ నెలలో మొత్తంగా 8 రోజులు బ్యాంకులు పనిచేయవు. కరోనా నేపథ్యంలో ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపే మొగ్గు చూపడం మంచిది. ఇక అసలు జూలై నెలలో ఏయే రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బ్యాంకుల సెలవుల లిస్టు ఇదే…

  • జూలై 5 – ఆదివారం
  • జూలై 11 – రెండో శనివారం
  • జూలై 12 – ఆదివారం
  • జులై 19- ఆదివారం
  • జూలై 20 – బోనాల పండగ(తెలంగాణ)
  • జూలై 25 – నాలుగో శనివారం
  • జూలై 26 – ఆదివారం
  • జూలై 31 – బక్రీద్

Also Read: చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!