దుమ్మురేపిన మార్కెట్లు… నిఫ్టీ 9,300…

ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు రాణించడంతో సూచీల్లో జోష్ పెరిగింది. ఇందులో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పునః ప్రారంభం కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో కొనుగోళ్లకు వైపు మొగ్గు చూపారు. బ్యాంకింగ్ షేర్లతోపాటు ఐటీ, మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో పయనించాయి. ప్రారంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన […]

దుమ్మురేపిన మార్కెట్లు... నిఫ్టీ 9,300...
Follow us

|

Updated on: May 27, 2020 | 6:54 PM

ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు రాణించడంతో సూచీల్లో జోష్ పెరిగింది. ఇందులో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పునః ప్రారంభం కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో కొనుగోళ్లకు వైపు మొగ్గు చూపారు. బ్యాంకింగ్ షేర్లతోపాటు ఐటీ, మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో పయనించాయి. ప్రారంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపు ఊగిసలాడింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌ ముగిసే వరకు సూచీ జోరు కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ 995.92 పాయింట్లు లాభపడి 31,605.22 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 285.90 శాతం లాభపడి 9,314.95 పాయింట్ల వద్ద ముగిసింది.