నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇవాళ ఒక్కరోజు సమ్మెకు దిగానున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా స​మ్మెకు పిలుపునిచ్చాయి. రెండు బ్యాంకు సంఘాలు సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై అంశంపై  ఆల్ ఇండియా […]

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 1:04 AM

దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇవాళ ఒక్కరోజు సమ్మెకు దిగానున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా స​మ్మెకు పిలుపునిచ్చాయి. రెండు బ్యాంకు సంఘాలు సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే కేంద్రం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై అంశంపై  ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) మరియు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కార్పోరేషన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కారణంగా పలు బ్యాంకుల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. తమ ఒక్కరోజు సమ్మెకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి మంచి స్పందన వస్తుందని తాము ఆశిస్తున్నామంటూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (స్టేట్ ఫెడరేషన్) ప్రధాన కార్యదర్శి అన్నారు.