ఫ్లాష్: బ్యాంకుల సమ్మె వాయిదా.. యధావిధిగా..

దేశవ్యాప్తంగా భారీగా బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 26, 27వ తేదీల్లో చేపట్టాలనుకున్న రెండు రోజుల సమ్మె నిరవధికంగా వాయిదా పడింది. సోమవారం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశమైన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకుల వీలనం నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్న అంశాలపై సమగ్ర విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఉద్యోగ సంఘాల […]

ఫ్లాష్: బ్యాంకుల సమ్మె వాయిదా.. యధావిధిగా..
Follow us

|

Updated on: Sep 24, 2019 | 9:28 AM

దేశవ్యాప్తంగా భారీగా బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 26, 27వ తేదీల్లో చేపట్టాలనుకున్న రెండు రోజుల సమ్మె నిరవధికంగా వాయిదా పడింది. సోమవారం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశమైన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

బ్యాంకుల వీలనం నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్న అంశాలపై సమగ్ర విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదిత రెండు రోజుల సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు వారు వెల్లడించారు.

10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO యూనియన్లు ఈ నెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటుగా ఉద్యోగుల వేతనాలను సవరించాలని, పెన్షన్లను పెంచాలని బ్యాంక్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లన్నింటిని విశ్లేషించడానికి కేంద్రం చొరవ తీసుకోవడంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు.