Bank Merger: ఏప్రిల్ 1 నుంచి ‘మెగా’ విలీనం.. ఏయే బ్యాంక్‌లు కలవనున్నాయంటే..!

పది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను 4 బ్యాంక్‌లుగా కుదించే విలీన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరం చేశామని ఆమె అన్నారు.

Bank Merger: ఏప్రిల్ 1 నుంచి 'మెగా' విలీనం.. ఏయే బ్యాంక్‌లు కలవనున్నాయంటే..!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 9:53 AM

పది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను 4 బ్యాంక్‌లుగా కుదించే విలీన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరం చేశామని ఆమె అన్నారు. అయితే 10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను నాలుగు బ్యాంక్‌లుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించిందని.. విలీన విషయమై బ్యాంక్‌లతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నామని నిర్మలా వివరించారు. ఈ విలీనానికి నియంత్రణ పరమైన ఎలాంటి సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ప్రపంచస్థాయి బ్యాంక్‌లను తయారు చేసేందుకు.. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకే కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విలీనం వలన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మాత్రమే ఉండనున్నాయి.

మెగా విలీనంపై ప్రభుత్వ ప్రతిపాదన ఎలా ఉందంటే..!

1.ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్​ నేషనల్ బ్యాంక్‌లో కలపడం. దీని వలన రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌లా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవతరించనుంది. 2.కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయడం. దీని వలన కెనరా బ్యాంక్‌ నాల్గవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా అవతరించనుంది. 3. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడం. దీని వలన ఐదవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా యూనియన్ బ్యాంక్ అవతరించనుంది. 4. ఇండియన్​ బ్యాంక్‌లో అలహాబాద్​ బ్యాంక్‌ను విలీనం చేయడం. దీని వలన ఏడవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఇండియన్ బ్యాంక్‌ అవతరించనుంది.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్