Bank Holidays In february 2021: బ్యాంకుకు వెళ్ళాలనుకుంటున్నారా ? ఫిబ్రవరిలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే..

ప్రస్తుత కాలంలో ఏ పని అయినా ఆన్‏లైన్లోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. నిత్యావసర సరుకుల దగ్గర్నుంచి.. పేమెంట్స్ వరకు అన్ని ఆన్‏లైన్ ద్వారానే జరుగుతున్నాయి.

Bank Holidays In february 2021: బ్యాంకుకు వెళ్ళాలనుకుంటున్నారా ? ఫిబ్రవరిలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 5:32 PM

ప్రస్తుత కాలంలో ఏ పని అయినా ఆన్‏లైన్లోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. నిత్యావసర సరుకుల దగ్గర్నుంచి.. పేమెంట్స్ వరకు అన్ని ఆన్‏లైన్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ మన బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏదైనా పని జరగాలంటే మాత్రం నేరుగా బ్యాంకుకు వెళ్ళాల్సిందే. ఈ బిజీ లైఫ్‏లో ఒక్క రోజు టైం తీసుకోని బ్యాంకుకు వెళ్ళడం… తీరా మనం వెళ్లాక ఆ రోజు బ్యాంకుకు హాలీడే అని తెలియడం జరుగుతుంటాయి. దీంతో ఆ రోజు వెళ్ళిన పని కాకుండా అలాగే ఉండిపోతుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే బ్యాంకుకు వెళ్లాలి అనుకునే ముందే ఏ రోజు బ్యాంకులకు సెలువులు ఉన్నాయని తెలుసుకోవడం ఉత్తమం. ఇక 2021 ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసా..

ప్రతి నెలలో బ్యాంకులకు శని, ఆదివారాలు కాకుండా.. మిగతా స్పెషల్ డేస్‏లలో కూడా సెలవులు ఉంటాయి. అలాగే పండుగలు కాకుండా నేషనల్ హాలిడేస్ కూడా ఉంటాయి. కానీ ఈ నెలలో మాత్రం అలాంటివేం లేదు. ఈ విషయ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఒక్క స్పెషల్ హాలిడే కూడా లేదు. దీంతో ఈ నెలలో మీరు ఎప్పుడు వెళ్ళినా బ్యాంకులు ఓపెన్ అయి ఉంటాయి. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. అవికాకుండా ఈ నెలలో బ్యాంకులకు ఒక్క స్పెషల్ హాలిడే.. నేషనల్ హాలిడే లేవు. ఇక బ్యాంకులు పనులను ఈ నెలలో త్వరగానే పూర్తిచేసుకోవచ్చు.

Also Read:

Budget 2021 : మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?