Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

Bank Fraud Case: టిడిపి నేత షణ్ముగంకు బిగుస్తోన్న ఉచ్చు

Bank Fraud Case : TDP Shanmugam Cheating Case Updates, Bank Fraud Case: టిడిపి నేత షణ్ముగంకు బిగుస్తోన్న ఉచ్చు

Bank Fraud Case : టిడిపి నేత, చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంకు ఉచ్చు బిగిస్తోంది. తన హయాంలో బ్యాంకులో మోసాలకు పాల్పడిన విషయంపై  ఇప్పటికే అతనిపై చిత్తూరు వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది.  బ్యాంకులో బినామీల పేర 12 ఖాతాలను తెరిచి,  నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టిన షణ్ముగం…కోటి ఇరవై లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..పరారీలో ఉన్న షణ్ముగం కోసం గాలిస్తున్నారు. బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఇంత భారీ స్కామ్ జరిగే అవకాశం లేకపోవడంతో..వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకున్న 4 బ్రాంచీల్లోని ఖాతాలను పరిశీలించారు. ఒక్క దర్గా బ్రాంచ్ బ్యాంకులోనే 12 ఖాతాల్లో 39 అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఫేక్  ఖాతాదారులందర్నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన బ్యాంకు అక్రమాలను బయటకు తీసేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్.

Bank Fraud Case : TDP Shanmugam Cheating Case Updates, Bank Fraud Case: టిడిపి నేత షణ్ముగంకు బిగుస్తోన్న ఉచ్చు