ముంబై దాడుల సూత్రధారి బ్యాంకు అకౌంట్‌ పునరుద్ధరణ

ఉగ్రసంస్థలకు పాక్‌ ప్రభుత్వం పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఉగ్రవాద సంస్థలైన జమాత్‌ ఉద్‌ దావా, లష్కర్‌ ఏ తోయిబాకు చెందిన వారి బ్యాంకు అకౌంట్లను..

ముంబై దాడుల సూత్రధారి బ్యాంకు అకౌంట్‌ పునరుద్ధరణ
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 7:42 PM

ఉగ్రసంస్థలకు పాక్‌ ప్రభుత్వం పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఉగ్రవాద సంస్థలైన జమాత్‌ ఉద్‌ దావా, లష్కర్‌ ఏ తోయిబాకు చెందిన వారి బ్యాంకు అకౌంట్లను ఇమ్రాన్ సర్కార్ పునరుద్దించింది. ఈ అకౌంట్లలో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయ్యద్‌ బ్యాంకు అకౌంట్‌ కూడా ఉంది. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ నుంచి అధికారికంగా ఆమోదం పొందడంతో.. పాక్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. హఫీజ్‌తో పాటు.. అబ్దుల్‌ సలాం భుట్టవి, హాజీ ఎం అష్రాఫ్, యాహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్ బ్యాంకు అకౌంట్లను కూడా పునరుద్దరించింది. ఈ ఐదుగురు యూఎన్‌సీసీ ఎన్‌లిస్టెడ్‌ త్రీవావాదులని తెలిపింది.

కాగా, ప్రస్తుతం వీరంతా టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో లాహోర్ జైలులో శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే వీరంతా తమ కుటుంబ వ్యవహారాలను నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితికి రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు.