Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

బ్యాంక్ ఖాతా ఉందా..? జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ పనులు చేస్తే.. డబ్బు గల్లంతే..!

టెక్నాలజీ.. ఇది ఎందరికో విజ్ఞానాన్ని అందిస్తే.. అదే సమయంలో కేటుగాళ్లకి మోసాలు చేయడానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ.. ఈ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న కస్టమర్లు జాగ్రత్తగా లేకపోతే.. వారి అకౌంట్‌లో ఉన్న డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో భాగంగా బ్యాంక్‌ అకౌంట్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తున్న ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉండాల్సిందే. లేదంటే అకౌంట్‌లో డబ్బు గల్లంతే.

ప్రస్తుతం ప్రతిచోట డిజిటర్ ట్రాన్సాక్షన్స్‌ చేస్తూ.. టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. దీంతో రోజురోజుకు డిజిటల్ బ్యాంకింగ్ కూడా పెరిగిపోతోంది. దీంతో టెలికాం సంస్థలు నెట్‌వర్క్ కవరేజ్‌తో పాటుగా.. ఇంటర్నెట్ వేగాన్ని కూడా పెంచేశాయి. ఈ ట్రాన్సాక్షన్స్ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ సర్వీసుల వినియోగం కూడా పెరిగిపోయింది. అయితే ఇదే అదనుగా.. సైబర్ నేరగాళ్లు వారి మైండ్‌కు పదును పెట్టి.. మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా బ్యాంక్ కస్టమర్లే ఎక్కువగా మోసపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే.. బ్యాంక్ అకౌంట్ కలిగినవారు ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల వలల చిక్కకుండా బయటపడతారు.

వినియోగదారులు చేయకూడని పనులు ఏంటంటే…

* మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పొద్దు.
* పాస్‌వర్డ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లో కూడా నిక్షిప్తం చేయవద్దు
* డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పిన్, ఎంపిన్, కార్డుల సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. (బ్యాంకు వాళ్లు ఎవరు కూడా ఈ సమాచారాన్ని అడగరు)
* అంతేకాదు.. ఫోన్‌కు ఓటీపీ వచ్చిందంటూ ఎవరు ఫోన్ చేసి అడిగిన తిరస్కరించాలి.
* బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వాటిని ఎవరైనా కాల్ చేసి అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పొద్దు.
* ఎవరైనా కొత్త వ్యక్తి మీ ఫోన్‌లో.. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోమని చెబితే అస్సలు నమ్మొద్దు.
* అంతేకాదు.. ఎవరైనా మీ ఫోన్ సెట్టింగ్స్ మార్చమని కోరితే తిరస్కరించండి.
* గూగుల్ సెర్చ్‌‌లో వెతికితే వచ్చే బ్యాంక్, మర్చంట్, కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త..అందులో కొన్నిఫేక్ నెంబర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
* మీకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను పంపమంటే కూడా.. పంపొద్దు.
* మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ వంటి వివరాలను సోషల్ మీడియాలో పెట్టకపోవడం ఎంతో మంచిది
* పేమెంట్ గేట్‌ వేస్ యాప్‌లు.. మొబైల్ బ్యాంకింగ్ సంబంధిత యాప్స్‌కు యాప్ లాక్ పెట్టుకోవడం బెటర్
* ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో.. మీకు తెలియకుండా ఏమైనా మోసపూరిత ట్రాన్సాక్షన్స్ జరిగితే.. వెంటనే బ్యాంక్‌లో ఫిర్యాదు చేయండి