ఐసీసీ ప్రపంచకప్‌ 2019: బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డ్

Bangladesh, ఐసీసీ ప్రపంచకప్‌ 2019: బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డ్

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ జట్టు అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టింది. దక్షిణాఫ్రికాతో ఓవల్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే 75/2తో నిలిచిన బంగ్లాదేశ్‌ జట్టుని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ముష్ఫికర్ రహీమ్ (78: 80 బంతుల్లో 8×4), షకీబ్ అల్ హసన్ (75: 84 బంతుల్లో 8×4, 1×6) శతక భాగస్వామ్యంతో మెరుగైన స్థితిలో నిలిపారు. సఫారీ బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న ఈ జోడీ.. మూడో వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాకుండా.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *