మొన్న అలా.. నేడు ఇలా.. బంగ్లా వైఖరిలో ఛేంజ్

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమాలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి. అయితే ఈ క్రమంలో బంగ్లాదేశ్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు.. భారత్ – బంగ్లా బార్డర్‌ సమీపంలో మొబైల్ నెట్‌వర్క్ సర్వీసులను నిలిపివేసింది. భద్రతా కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా అధికారులు […]

మొన్న అలా.. నేడు ఇలా.. బంగ్లా వైఖరిలో ఛేంజ్
Follow us

| Edited By:

Updated on: Jan 02, 2020 | 4:10 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమాలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి. అయితే ఈ క్రమంలో బంగ్లాదేశ్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు.. భారత్ – బంగ్లా బార్డర్‌ సమీపంలో మొబైల్ నెట్‌వర్క్ సర్వీసులను నిలిపివేసింది.

భద్రతా కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా అధికారులు పేర్కొన్నారు. అయితే వాస్తవానికి అసలు రీజన్ వేరే ఉంది. ఇండియాలో జరుగుతున్న ఆందోళనల క్రమంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు తిరిగి బార్డర్ దాటి బంగ్లా వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ క్రమంలో వారంతా బంగ్లాలోని వ్యక్తులతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారిని మళ్లీ బంగ్లాదేశ్‌లోనికి రాకుండా అడ్డుకునేందుకు ఈ నెట్ వర్క్ సర్వీసులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలో బంగ్లా అధికారులు మళ్లీ వారి వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రెండు రోజులపాటు నిలిపేసిన మొబైల్ నెట్‌వర్క్‌ సర్వీసులను బుధవారం మళ్లీ పునరుద్ధరించారు. బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ (బీటీఆర్‌సీ) ఆదివారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. దాదాపు 2 వేల బేస్ ట్రాన్‌సీవర్ స్టేషన్ల నుంచి నెట్‌వర్క్‌ను నిలిపేశారు. దీంతో 32 జిల్లాల్లోని సుమారు 1 కోటి మందిపైన దీని ఎఫెక్ట్ పడింది. అయితే బుధవారం తిరిగి నెట్ వర్క్ సర్వీసులను అందిస్తుండటంతో.. అన్ని సర్వీసులను పునరుద్దరించినట్లు తెలుస్తోంది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్