భారత్ టూ బంగ్లా.. లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు

యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కంటికి కనిపించని కరోనా వణికిస్తోంది. లక్షల మందని ఇప్పటికే పొట్టనబెట్టుకుంది. దీనికి ఇప్పటికీ విరుగుడు లేకపోవడంతో.. ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో మన దేశంలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవనిగా మారాయి. అయితే ఈ మాత్రలను ఇప్పటికే మన దేశం దాదాపు 50 దేశాలకు సప్లై చేసింది. అందులో ఎన్నో దేశాలకు ఉచితంగా ఇవ్వగా.. మరికొన్ని దేశాలకు విక్రయించింది. ఇక తాజాగా మన పొరుగున ఉన్న […]

భారత్ టూ బంగ్లా.. లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 8:45 PM

యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కంటికి కనిపించని కరోనా వణికిస్తోంది. లక్షల మందని ఇప్పటికే పొట్టనబెట్టుకుంది. దీనికి ఇప్పటికీ విరుగుడు లేకపోవడంతో.. ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో మన దేశంలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవనిగా మారాయి. అయితే ఈ మాత్రలను ఇప్పటికే మన దేశం దాదాపు 50 దేశాలకు సప్లై చేసింది. అందులో ఎన్నో దేశాలకు ఉచితంగా ఇవ్వగా.. మరికొన్ని దేశాలకు విక్రయించింది. ఇక తాజాగా మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు కూడా ఈ మెడిసిన్‌ను సప్లై చేసింది. ఆదివారం భారత్‌ నుంచి వెళ్లిన లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు, 50 వేల సర్జికల్ గ్లోవ్స్‌ను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంది సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌లో భాగంగా.. భారత్‌.. బంగ్లాదేశ్‌కు సహాయం అందించింది. ఇది తొలిసారి కాదు.. రెండో సారి. తొలుత హెడ్ కవర్లను పంపగా.. ఇప్పుడు గ్లౌవ్స్‌తో పాటు.. మెడిసిన్‌ను కూడా పంపింది. కాగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు 5 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారు.