నిన్న భాగ్యనగరం.. నేడు గార్డెన్ సిటీ

భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇప్పుడు గార్డెన్ సిటీ బెంగళూరులో అందుకున్నాయి. రాజధాని నగరంతో పాటు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీటి ఉధృతికి రోడ్లపై కార్లు, ఆటోలు, బైక్ లు పడవల్లా కొట్టుకుపోయాయి. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీగా వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు నగరంలోని పలు కాలనీలు నదులను తలపించాయి. హోసకరేహల్లి ప్రాంతంలో వరద తీవ్రత […]

  • Venkata Narayana
  • Publish Date - 7:32 am, Sat, 24 October 20

భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇప్పుడు గార్డెన్ సిటీ బెంగళూరులో అందుకున్నాయి. రాజధాని నగరంతో పాటు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీటి ఉధృతికి రోడ్లపై కార్లు, ఆటోలు, బైక్ లు పడవల్లా కొట్టుకుపోయాయి. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీగా వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు నగరంలోని పలు కాలనీలు నదులను తలపించాయి. హోసకరేహల్లి ప్రాంతంలో వరద తీవ్రత సినిమా ఫక్కీని తలపించింది. దసరా పండుగవేళ భారీ వర్షాలు కన్నడీగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.