బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. ఏంటీ మిస్ట‌రీ…

భారీ శబ్దాలతో బెంగళూరు వాసులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. బుధవారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్, సర్జాపూర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్ తదితర ఏరియాల్లో గుర్తు తెలియని, వింత శబ్దాలు వినపించడంతో స్థానికులు కంగుతిన్నారు. కొందరు భూకంపం వచ్చిందేమోనని రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. కానీ ఆ సౌండ్స్ భూకంపం కార‌ణంగా వచ్చినవి కావని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ తేల్చేసింది. సెస్మోమీటర్లలో భూప్రకంపనలేవీ రికార్డు అవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇవి మిస్టిరియ‌స్ శ‌బ్దాల‌ని పేర్కొంది. భూకంపం […]

బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. ఏంటీ మిస్ట‌రీ...
Follow us

|

Updated on: May 20, 2020 | 4:15 PM

భారీ శబ్దాలతో బెంగళూరు వాసులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. బుధవారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్, సర్జాపూర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్ తదితర ఏరియాల్లో గుర్తు తెలియని, వింత శబ్దాలు వినపించడంతో స్థానికులు కంగుతిన్నారు. కొందరు భూకంపం వచ్చిందేమోనని రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. కానీ ఆ సౌండ్స్ భూకంపం కార‌ణంగా వచ్చినవి కావని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ తేల్చేసింది. సెస్మోమీటర్లలో భూప్రకంపనలేవీ రికార్డు అవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇవి మిస్టిరియ‌స్ శ‌బ్దాల‌ని పేర్కొంది.

భూకంపం సంభ‌విస్తే..అది కేవ‌లం ఒక ప్రాంతానికే పరిమితం కాదని.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో సైతం దాని ఎఫెక్ట్ ఉంటుందని కేఎస్ఎన్ఎండీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివ‌రించారు. సెన్సార్లను పరిశీలించామని.. భూకంపం తాలుకా సంకేతాలు క‌నిపించ‌లేద‌ని వెల్ల‌డించారు. ఫైటర్ జెట్స్ వెళ్లడం వల్ల ఈ భారీ సౌండ్స్ వచ్చి ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఏలియ‌న్స్ అనే ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి . కొందరు స్థానికులు సౌండ్స్ ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా ఈ శబ్దాల వల్ల ఎలాంటి ప్రాణ‌, ధ‌న‌ నష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ఫ్లైట్లు లేదా సూపర్ సోనిక్ శబ్దాలేమో అని నిర్ధారించుకోవడం కోసం బెంగళూరు పోలీసులు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూంను సంప్రదించారు.