Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

మళ్లీ పొలిటికల్ సీన్‌లోకి బండ్ల.. ఏం చేశాడంటే..?

Bandla ganesh support to pawan kalyan with his tweet, మళ్లీ పొలిటికల్ సీన్‌లోకి బండ్ల.. ఏం చేశాడంటే..?

బండ్ల గణేశ్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా  7’O’ క్లాక్‌ బ్లేడ్‌కి ఫేమ్ తెచ్చిన వ్యక్తిగా అందరికి సుపరిచితుడే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసిన ఆయన..పంచ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు వల్లమాలిన ప్రేమ అని, ఎన్నికల్లో ఆ పార్టీనే ఘంటాపథంగా గెలబోతుందని జోస్యం చెప్పాారు. అయితే సీన్ రివర్సయ్యింది. కారు జోరుకు హస్తం పార్టీ బ్రేకులెయ్యలేకపోయింది. కాంగ్రెస్ దారుణ ఓటమితో కొన్నాళ్లు సైలెంటైపోయాడు బండ్ల. ఆ తర్వాత రాజకీయాల జోలికి వెళ్లని ప్రకటించారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సిల్వర్ స్రీన్‌పై నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చి నవ్వులు కురిపించారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, బండ్ల గణేశ్‌ ఎటువంటి  స్పెష‌ల్ భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అంటే తనకు వ్యసనం అని కూడా చెబుతుంటాడు ఈ కమెడియన్ కమ్ నిర్మాత. అయితే రాజకీయాల జోలికి వెళ్లనన్న బండ్ల.. మళ్లీ పొలిటికల్ స్టంట్‌తో సీన్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసినప్పుడు పెద్దగా పవన్ గురించి మాట్లాడానికి ఇష్టపడని ఆయన..ఇప్పుడు ఆయనపై ఏకంగా ట్వీట్ వేశారు. “నేను భయంతో రాలేదు – బాధ్యతతో వచ్చాను” అనే ట్యాగ్‌ లైన్ ఉన్న పవన్ ఫోటోను “ఇది నిజం” అంటూ ఫోస్ట్ చేశారు బండ్ల గణేశ్. ఆ ట్వీట్‌కి జనసేనానిని కూడా ట్యాగ్ చేశారు. సడన్‌గా పవన్‌పై ఈ భక్తుడు ప్రేమను కురిపించడం వెనుక మతలబేమిటా అని చర్చించికుంటున్నారు నెటిజన్లు.

Related Tags