”నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్” అంటూ ఎమ్మెల్సీ కవితను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్…
”నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్” అంటూ ఎమ్మెల్సీ కవితను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఆయన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆ సందర్భంలో బండ్ల గణేష్ పేరు ప్రస్తావిస్తూ.. ‘‘గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా… ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారు’’ అంటూ మాట్లాడారు. ఆమె మాట్లాడిన ఆ వీడియో వీడియో వైరల్ అయ్యింది. దీంతో బండ్ల గణేష్ ట్విట్టర్లో బదులిచ్చారు.
@RaoKavitha garu I am not a joker , I’m a fighter but I don’t want to be in any politics right now .
All the best 🙏— BANDLA GANESH. (@ganeshbandla) November 29, 2020
నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా…
తనకు రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని బండ్ల గణేష్ పలు సందర్భాల్లో బహిరంగంగా తెలిపారు. తనపై కొందరు పనిగట్టుకుని మరీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని పదే పదే చెబుతున్నారు. దయచేసి తాను గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దని నెటిజన్లను కోరుతున్నాడు. ఇకపై తాను సినీ ఇండస్ర్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, బండ్ల గణేష్ ఇటీవలే పవన్ తో త్వరలో సినిమా తీయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. పవన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.