బండ్ల గణేశ్‌కు రిమాండ్‌..సినిమాను తలపిస్తోన్న ట్విస్ట్‌లు

చెక్‌బౌన్స్‌ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను కడప కోర్టు రిమాండ్‌కు తరలించింది. ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్‌ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన రూ.20లక్షల అప్పును బండ్ల గణేశ్‌ చెల్లించలేదని కడప న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గతంలో కడప కోర్టు గణేశ్‌కు సమన్లు జారీ చేసింది. ఆయన సకాలంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం రాత్రి ఆయన్ను అరెస్టు […]

బండ్ల గణేశ్‌కు రిమాండ్‌..సినిమాను తలపిస్తోన్న ట్విస్ట్‌లు
Follow us

|

Updated on: Oct 24, 2019 | 4:08 PM

చెక్‌బౌన్స్‌ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను కడప కోర్టు రిమాండ్‌కు తరలించింది. ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్‌ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన రూ.20లక్షల అప్పును బండ్ల గణేశ్‌ చెల్లించలేదని కడప న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గతంలో కడప కోర్టు గణేశ్‌కు సమన్లు జారీ చేసింది. ఆయన సకాలంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేసి గురువారం ఉదయం కడప న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం బండ్ల గణేశ్‌కు నవంబర్‌ 4వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నారు.

సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నోటీసులు స్వీకరించేందుకు బండ్ల గణేశ్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే, చెక్‌బౌన్స్‌ కేసులో ఆయనపై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.