BJP firing మోదీని అంటే ఊరుకునేది లేదు.. ఓవైసీకి బండి వార్నింగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఎంపీగా బాధ్యతంగా ప్రజలకు పిలుపునివ్వలేని ఓవైసీ.. ప్రధాన మంత్రిపై ఎదురు దాడి చేయడం విడ్డూరంగా వుందన్నారు.

BJP firing మోదీని అంటే ఊరుకునేది లేదు.. ఓవైసీకి బండి వార్నింగ్
Follow us

|

Updated on: Apr 02, 2020 | 1:38 PM

Bandji Sanjay warsn Asaduddin Owaisi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఎంపీగా బాధ్యతంగా ప్రజలకు పిలుపునివ్వలేని ఓవైసీ.. ప్రధాన మంత్రిపై ఎదురు దాడి చేయడం విడ్డూరంగా వుందన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్న మోదీని ఏమైనా అంటే సహించేది లేదని సంజయ్ ఓవైసీకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఎంపీగా బడ్జెట్ సమావేశాల ప్రాధాన్యత తెలిసి… పార్లమెంట్ సమావేశాలను ఎందుకు కొనసాగించారంటూ పిచ్చిగా ప్రశ్నించొద్దని ఓవైసీని హెచ్చరించారు సంజయ్.

నిజాముద్దీన్ ఘటనలో ప్రభుత్వలకు సహకరించాల్సి పోయి.. ఎపీ ఎదురుదాడికి దిగడం ఏంటని ఒవైసీని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన సీనియర్ ఓవైసీకి వార్నింగ్ ఇచ్చారు. ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలేషన్ వార్డుగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని సంజయ్ డిమాండ్ చేశారు. మైనార్టీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే ఒవైసీ.. ఈ కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా బారిన పడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఒవైసీకి తగదని, ముస్లింల ఓట్లతో రాజకీయం చేసే అసదుద్దీన్ వారికి ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటని అన్నారు బండి సంజయ్. డాక్టర్లపై జరిగిన దాడిని ఖండించకపోవడంపై ఓవైసీని నిలదీశారు సంజయ్.